Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా టీకా తీసుకున్న వలంటీరు మృతి... ఎక్కడ?

Webdunia
గురువారం, 22 అక్టోబరు 2020 (08:46 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు విరుగు కనిపెట్టే పనిలో అనేక దేశాలు నిమగ్నమైవున్నాయి. భారత్‌తో పాటు చైనా, అమెరికా, రష్యాన్, ఫ్రాన్స్, బ్రెజిల్, ఇజ్రాయేల్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఈ టీకాల అభివృద్ధిలో పాలుపంచుకుంటున్నాయి. అయితే, బ్రెజల్‌ జరుగుతున్న టీకా ప్రయోగాల్లో ఓ అపశృతి చోటుచేసుకుంది. టీకా తీసుకున్న వలంటీరు ప్రాణాలు కోల్పోయాడు. ఈ టీకాను ఆస్ట్రాజెనెకా బయోఫార్మా కంపెనీ ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటితో కలిసి అభివృద్ధి చేస్తోంది. ఈ టీకా తీసుకున్న వలంటీరు ప్రాణాలు కోల్పోయినట్టు బ్రెజిల్ కూడా అధికారికంగా నిర్ధారించింది. 
 
ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంతో కలిసి ఆస్ట్రాజెనెకా కరోనా టీకాను అభివృద్ధి చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఈ టీకాను పరీక్షిస్తున్నారు. మొదటి, రెండోదశ ప్రయోగాల్లో భాగంగా ఇటీవల బ్రిటన్‌లో ఈ టీకాను తీసుకున్న ఓ వ్యక్తి అనారోగ్యానికి గురికావడంతో పరీక్షలను తాత్కాలికంగా నిలిపివేశారు. 
 
ఇటీవలే మళ్లీ ఈ ప్రయోగాలను ప్రారంభించారు. మూడో దశలో ఈ టీకాను వేయించుకున్న ఓ వలంటీర్ మృతి చెందినట్టు బ్రెజిల్ ఆరోగ్య విభాగం నిన్న వెల్లడించింది. అయితే, అతడు వ్యాక్సిన్ కారణంగా మరణించాడా? లేక, మరే కారణమైనా ఉందా? అన్న విషయాన్ని వెల్లడించని అధికారులు, పరీక్షలు మాత్రం కొనసాగుతాయన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments