Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను చాకచక్యంగా వదిలించుకున్న భర్త.. కరోనా అని పుట్టింట్లో దింపి..?

Webdunia
బుధవారం, 17 జూన్ 2020 (11:46 IST)
భార్యను వదిలించుకోవాలని భర్త సూపర్ డ్రామా చేశాడు. కరోనా కదా అంటూ పుట్టింటిలో వదిలిపెట్టాడు. భర్త మాటలు నమ్మి పాపను తీసుకుని భార్య కూడా పుట్టింటికి వెళ్లింది. కానీ ఇంటిని ఖాళీ చేసుకుని పారిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్, నారాయణగూడలో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. నారాయణ గూడ విక్రమ్ నగర్ పార్కుకు చెందిన మహేందర్ 8 ఏళ్ల క్రితం ముషీరాబాద్‌కి చెందిన వీణను పెళ్లి చేసుకున్నాడు. వాళ్లకు ఓ పాప పుట్టింది. ఎంతో అన్నోన్యంగా ఉండేవాళ్లు. ఏ గొడవలూ లేవు. 
 
అలాంటిది ఈ ఏడాది ఉగాదికి ముందు కరోనా సాకుతో భార్యను భర్త పుట్టింట్లో దింపాడు. కరోనా అని రావద్దన్నాడు. దీన్ని నమ్మిన భార్య.. పుట్టింటిలో కొన్ని నెలలు గడిపింది. ఎంతకీ భర్త తనను తీసుకెళ్లడానికి రావట్లేదనీ, ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ వస్తోందనే ఉద్దేశంతో ఆమె పుట్టింటి నుంచి బయల్దేరి నారాయణగూడలోని ఇంటికి వెళ్లింది. అక్కడ ఇంటికి తాళం వేసి ఉంది. 
 
పక్కింటి వాళ్లను అడిగితే... ఇల్లు ఖాళీ చేసేశారని చెప్పింది. దీంతో షాకైన భార్య.. కిటికీల్లోంచి చూస్తే ఇంట్లో ఒక వస్తువు కనిపించలేదు. దీంతో ఆమెకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అసలు తన భర్త ఎందుకు అలా చేశారో తెలియలేదు. పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చింది. కానీ పోలీసులు ఇప్పటికీ న్యాయం చెయ్యట్లేదని ఆమె ఆరోపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

ఆనంది, వరలక్ష్మిశరత్‌కుమార్ థ్రిల్లర్ శివంగి ఆహా లో స్ట్రీమింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments