ఏపీలో కరోనా ఉధృతి.. 88కి చేరిన మృతుల సంఖ్య.. 264మందికి పాజిటివ్

Webdunia
బుధవారం, 17 జూన్ 2020 (11:06 IST)
ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. మంగళవారం ఒక్కరోజే 264 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. వీటితో కలిపి పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,720కి చేరింది. మంగళవారం చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 88కి చేరింది. శ్రీకాకుళం జిల్లాలో 88మందికి పాజిటివ్‌ అని తేలింది. కృష్ణాజిల్లాలో మరో 42మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
 
దీంతో జిల్లాలో కేసుల సంఖ్య 1022కి చేరుకుంది. పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా మరో 41కేసులు నమోదయ్యాయి. గుంటూరు ప్రభుత్వాస్పత్రిలోని ముగ్గురు నర్సులు కరోనా బారిన పడ్డారు. అనంతపురం జిల్లాలో 28మందికి పాజిటివ్‌ వచ్చింది. కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో 56చొప్పున, తూర్పుగోదావరిలో 16, నెల్లూరులో 5కేసులు నమోదయ్యాయి. 
 
మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తోంది. మంగళవారం ఉదయం 8 గంటలకు గడచిన 24 గంటల్లో 10,667 కేసులు నమోదయ్యాయని 380మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం 9,900 మరణాలతో ప్రపంచ జాబితాలో భారత్‌ 8వ స్థానానికి చేరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

PM Modi: ప్రధాని మోదీ పెద్ది గురించి అడిగారు, వెస్ట్ బెంగాల్‌లో యూత్ పెద్ది గెటప్‌తో వచ్చారు: రామ్ చరణ్

Radhya: ది రెడ్ బ్యాగ్ చిత్రం నుంచి హీరోయిన్ రాధ్య లుక్

Satyadev: బిహైండ్ ది వుడ్స్ ఆఫ్ సమవర్తి మేకింగ్ లో సత్యదేవ్

Vadenaveen: వడ్డే నవీన్‌ ట్రాన్స్‌ఫ‌ర్ త్రిమూర్తులు నుంచి తొలి సాంగ్ ‘టా టా’ను విడుదల

హర్షిత్ రెడ్డి దీవాన మూవీ నుంచి వన్ సైడ్ లవ్ స్టోరీ పాటకు ఆదరణ

తర్వాతి కథనం
Show comments