Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల్గొండ జిల్లా మున్సిపల్ ఛైర్‌పర్సన్ భర్తను చంపేశారు...

తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా మున్సిపల్ ఛైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి భర్త శ్రీనివాస్ దారుణ హత్యకు గురయ్యారు. ఆయన ఇంటి ఆవరణలోనే గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం రాత్రి దారుణంగా హత్య చేశారు.

Webdunia
గురువారం, 25 జనవరి 2018 (09:12 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా మున్సిపల్ ఛైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి భర్త శ్రీనివాస్ దారుణ హత్యకు గురయ్యారు. ఆయన ఇంటి ఆవరణలోనే గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం రాత్రి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనతో నల్గొండ పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సంచలనం రేకెత్తించిన ఈ ఘటనలో మృతి చెందిన వ్యక్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధాన అనుచరుడు.
 
నల్గొండలోని సావర్కర్ నగర్‌లో కుటుంబంతో కలిసి ఆయన నివాసం ఉంటున్నారు. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో ఆ ప్రాంతంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఘర్షణపడ్డారు. ఈ విషయంలో స్థానిక కౌన్సిలర్‌ కుమారుడు మెరగు గోపి సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఘర్షణ సద్దుమణగలేదు.
 
దీంతో గోపి, శ్రీనివాస్‌‌కు ఫోన్‌ చేసి విషయం వివరించగా, ఇంటి నుంచి బయటకు వచ్చిన శ్రీనివాస్‌ వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాటామాట పెరిగింది. ఆ సమయంలో శ్రీనివాస్‌ వెనుకవైపు నుంచి వచ్చిన ఓ వ్యక్తి తలపై బండరాయితో మోది హత్య చేసి, పక్కనే ఉన్న మురికి కాలువలో పడేసిన నిందితులు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరిగినట్టు తెలుస్తోంది. 
 
అనంతరం జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టంకి తరలించారు. సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. సమాచారం అందుకున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హైదరాబాద్ నుంచి నల్గొండ చేరుకుని శ్రీనివాస్ కుటుంబానికి ధైర్యం చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ivana: లవ్ టుడే.. ఆ కళ్ళతో కట్టిపారేసింది.. శ్రీదేవి, మీనా, రాశి బాటలో ఇవానా!?

Tamannaa: నాగసాధువు తమన్నా ప్రమోషన్ కోసం హైదరాబాద్ విచ్చేసింది

SS Rajamouli: మహేష్ బాబు సినిమాకు సంగీతం ఒత్తిడి పెంచుతుందన్న కీరవాణి

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments