Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాదగిరిగుట్టకు సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఎన్‌.వి. రమణ

Webdunia
శనివారం, 12 జూన్ 2021 (19:43 IST)
భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌.వి. రమణ మొన్నటికి మొన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఈ నెల 14న యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు యాదగిరిగుట్టకు వస్తున్నారు.

గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్, సీఎం కేసీఆర్, హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి హిమా కోహ్లీ తదితరులు ప్రధాన న్యాయమూర్తి వెంట రానున్నారు. ఘన స్వాగతం పలికేందుకు చేయాల్సిన ఏర్పాట్ల పై సమీక్షించారు. యాదాద్రి ఆలయ నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్, వైటీడీఏ అధికారులు ఉన్నారు. 
 
స్వామి వారిని దర్శించుకున్న అనంతరం వారు యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. అనంతరం నిర్మాణం పూర్తయిన ఈవో నూతన కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. తొలిసారిగా సీజేఐ యాదాద్రి సందర్శన సందర్భంగా శనివారం జిల్లా మంత్రి గుంతకండ్ల జగదీష్ రెడ్డి, సీఎంవో ప్రధాన కార్యదర్శి భూపాల్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్ రెడ్డి తదితరులు ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. 

సంబంధిత వార్తలు

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

ఎందుకొచ్చిన గొడవ.. నా ట్వీట్‌ను తొలగించాను.. నాగబాబు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments