ముస్లిం వ్యాపారులు కరోనా పరీక్షలు చేయించుకోండి: అసదుద్దీన్‌

Webdunia
బుధవారం, 22 జులై 2020 (20:47 IST)
ముస్లిం వ్యాపారులందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని హైదరాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గం ఎంపి అసదుద్దీన్‌ ఒవైసి అన్నారు.

కరోనా పరీక్షలు చేయించుకోవడం ద్వారా తమను తాము కాపాడుకోవడమే కాకుండా సమాజాన్ని కాపాడినట్లు అవుతుందన్నారు.

యాకుత్‌పురా ఎమ్మెల్యే సయ్యద్‌ అహ్మద్‌ పాషా ఖాద్రీతో కలిసి ఆయన చార్మినార్‌ యునానీ ఆసుపత్రిలోని కరోనా పరీక్షల కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ ఖురేషి సామాజిక వర్గానికి జరుగుతున్న కరోనా పరీక్షలను ఆయన పరిశీలించారు.

బక్రీద్‌ పండుగ సందర్భంగా జరిగే మాంసం విక్రయాల్లో ఖురేషి సామాజిక వర్గానికి చెందిన వ్యాపారుల ప్రాధాన్యత ఎంతో ఉంటుందన్నారు. వీరందరూ ముందస్తుగా కరోనా పరీక్షలు చేయించుకుంటే ఆశించిన ఫలితాలు ఉంటాయన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐక్య నా బిడ్డ లాంటిది, మా ఈ ట్రస్ట్ వాయిస్‌లెస్‌కి వాయిస్‌గా ఉంటుంది: మనోజ్ మంచు

Yash: టాక్సిస్ సెట్ నుండి రాయ గా యష్ లుక్

నారా లోకేష్‌కు ఎక్కువ మంది పిల్లలు వుండాలని భావిద్దాం, బావ ఫోటో పెట్టావు: పూనమ్ కౌర్ ట్వీట్

Yash: టాక్సిక్ సెట్ నుండి రాయా గా అద్భుతమైన స్టిల్‌ తో యష్

Purusha : ఆద్యంతం వినోదభరితంగా పురుష:ట్రైలర్

తర్వాతి కథనం
Show comments