Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

65 ఏళ్ల పైబడిన వారికి కరోనా టెస్ట్ లు ఎక్కువ చేయండి: జవహర్ రెడ్డి

Advertiesment
65 ఏళ్ల పైబడిన వారికి కరోనా టెస్ట్ లు ఎక్కువ చేయండి: జవహర్ రెడ్డి
, గురువారం, 4 జూన్ 2020 (09:22 IST)
కరోనా టెస్ట్ లు చేయడంలో దేశంలోనే మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని, అన్ని జిల్లాల్లో కూడా కరోనా టెస్ట్ ల సంఖ్య ను రోజు రోజుకీ  గణనీయంగా పెంచుతూ పెద్ద సంఖ్యలో చేయడం అభినందనీయమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ డా.కె.ఎస్ జవహర్ రెడ్డి అన్నారు.

కర్నూలు సమీపంలో పంచలింగాల అంతర్ రాష్ట్ర టోల్ గేట్, చెక్ పోస్ట్ వద్ద మన రాష్ట్రంలోకి వచ్చే వారికి థర్మల్ స్క్రీనింగ్, స్వాబ్ కలెక్షన్ కోసం కర్నూలు జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన రిసెప్షన్ కేంద్రాన్ని తనిఖీ చేసిన అనంతరం కర్నూలు స్టేట్ గెస్ట్ హౌస్ లో కర్నూలు, అనంతపురం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీ,జేసీలు, వైద్య ఆరోగ్యశాఖ అధికారుల తో స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయంత్రం వరకు కరోనా కట్టడి చర్యలపై సమీక్ష చేశారు
 
స్పెషల్ సిఎస్ సమీక్షా సమావేశంలో కర్నూలు జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, కర్నూలు ఎస్పీ డా.కె.ఫక్కీరప్ప,  జేసీలు రవి పట్టన్ షెట్టి, రామసుందర్ రెడ్డి, మునిసిపల్ కమీషనర్ డీకే బాలజీ, డిఎఫ్ఓ అలాన్ చాంగ్ టెరాన్, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ నిధి మీనా, డిఎంఈ డా.రాంప్రసాద్, 

కర్నూలు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డా.కె.చంద్రశేఖర్, అనంతపురం మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డా.మైరెడ్డి నీరాజా రెడ్డి,  ఓఎస్డీ డా.ప్రభాకర్ రెడ్డి,  కర్నూలు జిజిహెచ్ సూపరి0టెండెంట్ డా.నరేంద్రనాథ్ రెడ్డి, అనంతపురం జిజిహెచ్ సూపర్ ఇంటెండెంట్ డా. రామస్వామి నాయక్, కర్నూలు, అనంతపురం జిల్లాల డిఎంహెచ్ఓ లు డా.రామ గిడ్డయ్య, డా.అనిల్ కుమార్,   

డిసిహెచ్ లు డా.శిరీష, డా.రమేష్, టీచింగ్ హాస్పిటల్స్ , జిజిహెచ్ ల డాక్టర్లు, ఆర్ టి  పిసిఆర్ ల్యాబ్ ఇంచార్జి ప్రొఫెసర్లు, ఏపీఎంఎస్ ఐడిసి ఎస్ఈ కృష్ణారెడ్డి, ఈఈ విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా స్పెషల్ సీఎస్ డా.జవహర్ రెడ్డి మాట్లాడుతూ.. కంటైన్మెంట్ జోన్లలో అందరికీ కరోనా టెస్టులను నిర్వహిస్తున్నారని దీనికి అదనంగా నాన్ కంటైన్మెంట్ జోన్లలో కూడా ప్రత్యేకించి కర్నూలు, నంద్యాల, ఆదోని మునిసిపాలిటీలలో 65 సం. ల వయసు పైబడి బిపి, షుగర్, హృద్రోగ సమస్య లాంటి దీర్ఘకాలిక జబ్బులు ఉన్న వారిని చైతన్య పరిచి వారికి కరోనా టెస్ట్ లను విస్తృతంగా చేయాలని సూచించారు.

ఒక వేళ పాజిటివ్ వస్తే  ముందుగానే ఐసోలేట్ చేసి, మెరుగైన ట్రీట్మెంట్ ఇప్పించి తద్వారా వారి ప్రాణాలను కాపాడిన వారమవుతామని, ముందస్తు ట్రీట్మెంట్ తో  మృతుల శాతాన్ని కూడా తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డి జిజిహెచ్ డాక్టర్లకు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు, జిల్లా కలెక్టర్ కు సూచించారు.

అలాగే, కరోనా పాజిటివ్ వచ్చిన కోమార్బిడ్ పేషేంట్స్ కు మరింత శ్రద్ధ, అప్రమత్తంగా మెరుగైన వైద్యసేవలను అందించి వారి ప్రాణాలను కాపాడాలని కర్నూలు జిజిహెచ్ డాక్టర్లను స్పెషల్ సీఎస్ ఆదేశించారు. 
 
అలాగే బస్సులు, శ్రామిక్ రైళ్లలో జిల్లాకు వచ్చే వలస కార్మికులతో పాటు నడుచుకుంటూ లేదా ఇతర మార్గాల్లో చెప్పా పెట్టకుండా గ్రామాలకు, పట్టణాలకు వచ్చే వలస కార్మికులపై అప్రమత్తంగా ఉంటూ వాలంటీర్ల ద్వారా నిఘా పెట్టి అటువంటి వారిని వెంటనే క్వారంటైన్ చేసి కరోనా టెస్టు లను చేయాలని స్పెషల్ సీఎస్ ఆదేశించారు.

అంతేగాక, కర్నూలు జిల్లా సమీపంలో ఉన్న తెలంగాణా, కర్నాటక  గ్రామాల నుండి కర్నూలు జిజిహెచ్ లేదా ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి  వచ్చి కోవిడ్ పాజిటివ్ గా మారుతున్న వారు ఎంత మంది ఉన్నారని ఆయన అడిగి తెలుసుకున్నారు. 
 
అదేవిధంగా, జూన్ మాసంలో కేసులు గరిష్ట స్థాయికి చేరుకుంటాయని కోవిడ్-19 నిపుణులు చెబుతున్నారని అందువల్ల జిల్లాలో ఆ స్థాయికి తగ్గట్టు టెస్ట్ లు, హాస్పిటల్స్, బెడ్స్, ఐసియు, వెంటిలేటర్స్, ఆక్సీజన్, డాక్టర్లు, నర్సులు, మందులు తదితర సన్నద్ధ ఏర్పాట్లను కనీసం నాలుగువేల మందికి సరిపడా  పూర్తి స్థాయిలో చేసుకోవాలని స్పెషల్ సీఎస్ డా.జవహర్ రెడ్డి సూచించారు.

అలాగే, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ, ప్రయివేటు కోవిడ్ ఆస్పత్రిలు, నాన్ కోవిడ్ ఆస్పత్రుల్లో ఉన్న మెడికల్, మౌలిక సదుపాయాలు, క్వారంటైన్లు, కోవిడ్ కేర్ సెంటర్స్ ఏర్పాట్లు, సదుపాయాలు, పిపిఈలు, మందులు, మాస్కులు తదితర  అంశాలపై స్పెషల్ సీఎస్ డా. జవహర్ రెడ్డి సమీక్ష చేశారు.
 
కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కరోనా కట్టడికి చేపట్టిన చర్యలను కంప్యూటర్ పిపిటి ద్వారా పెద్ద తెరపై ప్రదర్శించి జిల్లా కలెక్టర్ లు జి.వీరపాండియన్, గంధం చంద్రుడు లు, జేసీలు రవి పట్టన్ షెట్టి, రామసుందర్ రెడ్డి లు స్పెషల్ సీఎస్ కు వివరించారు.
 
ఈ సందర్భంగా కర్నూలు జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ పిపిటి ద్వారా వివరిస్తూ జిల్లాలో ఇప్పటి వరకు 45,618 కరోనా సాంపిల్స్ సేకరించి టెస్టులు చేసామని అందులో 723 పాజిటివ్ కేసులు వచ్చాయని, 25 మంది మృతి చెందారని, ఇంకా 2691 సాంపిల్స్ టెస్టుల ఫలితాలు రావాల్సి ఉందని, అరోగ్యాంగా కోలుకుని డిశ్చార్చ్ అయిన వారి శాతం రాష్ట్రంలో లో కర్నూలు జిల్లాలో అత్యధికంగా సుమారు 68 శాతం ఉందని కలెక్టర్ వివరించారు.

జిల్లాకు గుంటూరు జిల్లా నుండి దాదాపు 53000 ల మంది వలస కార్మికులు తిరిగి రాగా వారిలో ఏక సంఖ్యలో పాజిటివ్ వచ్చిందని, అయితే ముంబై, ఇతర రాష్ట్రాల  నుండి వచ్చిన దాదాపు 4800 ల  వలస కార్మికులల్లో 234 మంది ముంబై రిటర్నేస్ కు పాజిటివ్ వచ్చిందని కలెక్టర్ వివరించారు.

అలాగే వాలంటీర్లు , గ్రామ కమిటీల ద్వారా 150 మంది నడిచి వచ్చిన వలస కార్మికులను గుర్తించి టెస్ట్ చేయించగా 5 మందికి పాజిటివ్ వచ్చిందని కలెక్టర్ తెలిపారు.

అలాగే జిల్లాలో మొత్తం ప్రభుత్వ ప్రైవేటు 10 పెద్ద  ఆస్పత్రిల్లో 4,660 బెడ్స్ ఉన్నాయని, 639 ఐసియూ బెడ్స్, 154 వెంటిలేటర్స్, ఉన్నాయని, 1307 ఆక్సీజన్ బెడ్స్ ఉన్నాయని కర్నూలు జిజిహెచ్ లో ఆక్సీజన్ పైప్లైన్ పనులు జరుగుతున్నాయని,  వారంలోపు 823  ఆక్సీజన్ బెడ్స్ అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

జిల్లాలో అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో, అన్ని 23 అర్బన్ హెల్త్ సెంటర్స్ , 25 శాతం పి హెచ్ సి లు, మొబైల్ యూనిట్ తదితర వాటి ద్వారా రోజుకు 1800 ల సాంపిల్స్ కలెక్ట్ చేసి టెస్టులు చేయిస్తున్నామని కలెక్టర్ వీరపాండియన్ వివరించారు.
 
అలాగే, ప్రయివేటు ఆస్పత్రుల్లో క్రిటికల్ కేసులను తీసుకోవడం లేదని జిజిహెచ్ డాక్టర్లు చెబుతున్నారని అందువల్ల జిజిహెచ్ డాక్టర్ల సలహా తీసుకుని  జిజిహెచ్ స్టేట్ కోవిడ్ హాస్పిటల్ లో కనీసం 100 బెడ్స్ నాన్ కోవిడ్ ఎమర్జెన్సీ పేషేంట్స్ కోసం వేరుగా ఏర్పాటు చేయాలని హెల్త్ స్పెషల్ సీఎస్ కు కలెక్టర్ వీరపాండియన్, జెసి రవి పట్టన్ షెట్టి, కెఎంసి ప్రిన్సిపల్ డా.చంద్రశేఖర్, జిజిహెచ్  డాక్టర్లు విజ్ఞప్తి చేయగా క్రాస్ ఇన్ ఫెక్షన్ జరగకుండా చర్చించి వెంటనే నిర్ణయం తీసుకొవాలని జిజిహెచ్ సూపర్ ఇంటెండెంట్ ను, ఎక్స్పర్ట్ కమిటీ ని  స్పెషల్ సీఎస్ ఆదేశించారు.
 
అలాగే ప్రస్తుతం ఉన్న ఆర్టీ పీసీఆర్, ట్రూనాట్ టెస్టింగ్ యంత్రాలకు  అదనంగా మరో రెండు ఆర్టీ-పీసీఆర్ టెస్టింగ్ యంత్రాలను జిల్లాకు మంజూరు చేయాలని కలెక్టర్ వీరపాండియన్ కోరారు.

అలాగే, కర్నూలు జిల్లాకు ఆడిగినవన్నీ రాష్ట్ర ప్రభుత్వం, స్పెషల్ సీఎస్ కొరత లేకుండా ఇస్తున్నారని, ధన్యవాదాలని అయితే  జూన్ మూడవ వారంలో కేసులు అత్యధికంగా వస్తాయనే సూచనకు అనుగుణంగా అదనంగా డాక్టర్లు, నర్సులను, వెంటిలేటర్స్, ఆక్సిజన్ యంత్రాలను జిల్లాకు కేటాయించాలని కూడా కలెక్టర్ వీరపాండియన్ స్పెషల్ సీఎస్ కు విజ్ఞప్తి చేశారు.
 
అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పిపిటి ద్వారా వివరిస్తూ జిల్లాలో 231 పాజిటివ్ కేసులు వచ్చాయని, 65 మంది మాత్రమే ప్రస్తుతం యాక్టీవ్ కేసులు ఉన్నాయని, మిగిలిన వారంతా ఆరోగ్యంగా డిశ్చార్చ్ అయ్యారని, ముగ్గురు మృతి చెందారని, ఇప్పటి వరకు 38,842 మందికి టెస్టు లు చేసామని,  టెస్టుల సంఖ్య పెంచుతామని కలెక్టర్ గంధం చంద్రుడు స్పెషల్ సీఎస్ ను కోరారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జార్జి ఫ్లాయిడ్‌ హత్య ముమ్మాటికీ జాత్యాహంకార పాపమే: పోప్‌