ఏపీ సీఎం జగన్‌ను కొనియాడిన కోమటిరెడ్డి.. మోటార్లకు మీటర్లు ఉంటే తప్పేంటి?

Webdunia
శనివారం, 24 సెప్టెంబరు 2022 (09:58 IST)
మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఏపీ సీఎం జగన్‌ను కొనియాడారు. మోటార్లకు మీటర్ల విషయంలో టీఆర్ఎస్ పార్టీ అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. 
 
అసలు మోటార్లకు మీటర్లు ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. మీటర్లు ఉన్నప్పటికీ, చార్జీలు వసూలు చేయడం లేదని ఏపీ సీఎం జగన్ చెప్పారని.. ఆయన నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని చెప్పారు. 
 
మోటార్లకు మీటర్లు పెడతామని కేంద్రం ఎక్కడ అధికారికంగా చెప్పలేదని ఆయన మరోసారి ధృవీకరించారు. 
డిస్కౌమ్‌లను కాపాడుకోవడం కోసం కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. 
 
అంతకుముందు.. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో అడుగుపెడుతున్న విషయంపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాజగోపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అవినీతిలో అన్ని రికార్డులు బద్దలుకొట్టే పాన్ ఇండియా స్టార్‌గా కేసీఆర్‌ని ప్రొజెక్ట్ చేయాలని కోమటి రెడ్డి ఎద్దేవా చేశారు.
 
రాష్ట్ర సంపదను కేసీఆర్ వంశం ఎలా కొల్లగొట్టిందో.. ఒక అవినీతి రాజకీయ సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించిందో భారత ప్రజలు తెలుసుకోనివ్వండంటూ కౌంటర్లు వేశారు. అలాగే.. మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nabha Natesh: అవకాశాల కోసం షర్ట్ విప్పి ఫోజ్ ఇస్తున్న నభా నటేష్

MM Srilekha: టైమ్ ట్రావెలింగ్ కొంత కన్ఫ్యూజన్ గా ఉంటుంది : ఎంఎం శ్రీలేఖ

Vijayendra Prasad: పవన్ మహావీర్ హీరోగా అమ్మా... నాకు ఆ అబ్బాయి కావాలి చిత్రం

singer Smita: ఓజి× మసక మసక సాంగ్ అందరినీ అలరిస్తుంది : పాప్ సింగర్ స్మిత

Sobhan Babu: నేటి టెక్నాలజీ తో శోభన్ బాబు- సోగ్గాడు రీ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి, నిమ్మకాయతో ఉప్పు.. గుండె ఆరోగ్యంతో పాటు రక్తపోటుకు చెక్

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

Tomato Soup: శీతాకాలంలో టమోటా సూప్ తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments