తెలుగు రాష్ట్రాలు నిప్పుల గుండం : 2 రోజులు బయటకు రావొద్దు

Webdunia
ఆదివారం, 18 ఏప్రియల్ 2021 (09:02 IST)
తెలుగు రాష్ట్రాల్లో భానుడు తన ప్రతాపాన్ని చూపించనున్నారు. రెండు రోజుల పాటు రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని, ఏ ఒక్కరూ తమతమ ఇళ్ళ నుంచి బయటకు రావొద్దని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 
 
ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండు రోజుల్లో భానుడి ప్రతాపం అధికంగా ఉంటుందని, దాదాపు అన్ని ప్రాంతాల్లో సాధారణంతో పోలిస్తే 2 నుంచి 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. 
 
ఆపై ఎండ వేడిమి స్వల్పంగా తగ్గుతుందని అంచనా వేశారు. విదర్భ నుంచి మరాట్వాడా వరకూ, కర్ణాటక నుంచి తమిళనాడు వరకూ ఉపరితల ద్రోణులు కొనసాగుతుండటమే ఇందుకు కారణమని ఓ అధికారి వెల్లడించారు. 
 
ఇదేసమయంలో ద్రోణి ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఎండ వేడిమి అధికంగా ఉన్న ప్రాంతాల్లో అత్యవసరమైతేనే, తగు జాగ్రత్తలు తీసుకుని ప్రజలు బయటకు రావాలని సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వానలో మిల్కీ బ్యూటీ తమన్నా వణికిపోతుంటే 11 లక్షల మంది చూసారు, వీడియో

హూర్‌తో కశ్మీర్ సంగీత వారసత్వాన్ని మనముందుకు తీసుకువస్తున్న కోక్ స్టూడియో భారత్ సీజన్ 4

Suman: మూఢనమ్మకాలను ఎండగట్టే కథతో నిమ్మకాయ.. నీకెందుకు భయం చిత్రం

Mupapa: ఆయుష్మాన్ ఖురానా చిత్రం ముపాపా రిలీజ్ డేట్ ఖరారు

Rana: అమీర్ లోగ్ ను రిలీజ్ చేయబోతోన్న రానా స్పిరిట్ మీడియా

తర్వాతి కథనం
Show comments