Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలపై వేధింపుల్లో తెలంగాణ స్థానమెంత?

Webdunia
గురువారం, 23 మార్చి 2023 (11:55 IST)
దేశంలో గృహ హింస కేసులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా, మహిళలపై వేధింపులు నానాటికీ ఎక్కువైపోతున్నాయి. కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. "విమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2022" పేరుతో ఒక సర్వేను నిర్వహించింది. ఈ నివేదికలో విస్తుపోయే నిజాలు వెల్లడించారు. దేశంలో నమోదవుతున్న 75 శాతం గృహ హింస కేసుల్లో ఒక్క అస్సాంలోనే నమోదవుతున్నట్టు ఆ నివేదిక బట్టబయలు చేసింది. ఆ తర్వాత స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉంది. ఈ రాష్ట్రంలో 50.4 శాతం గృహ హింస కేసులు నమోదవుతున్నాయి. 48.9 శాతం కేసులతో ఢిల్లీ మూడో స్థానంలో నిలిచింది. 
 
మహిళలపై మూడో వంతు దాడులు వారి భర్తలు, అత్తింటివారు, వారి బంధువులే చేస్తున్నవే కావడం గమనార్హం. మహిళలు ప్రధానంగా ఎదుర్కొంటున్న వాటిలో ఉద్దేశపూర్వకదాడులు, కిడ్నాప్, అత్యాచార యత్నాలు వంటివి ఉన్నాయి. 2015-16లో ఇవి 33.3 శాతంగా ఉండగా, 2019-21 నాటికి ఇవి స్వల్ప తగ్గుముఖం పట్టి 31.9 శాతానికి దిగివచ్చాయి. ఇపుడు మళ్లీ ఈ కేసులు దేశ వ్యాప్తంగా పెరిగిపోతున్నాయి. 
 
మరోవైపు మహిళపై జరుగుతున్న దాడుల కేసుల్లో అనేకం వెలుగులోకి రావడం లేదు. అలా వచ్చిన కేసుల్లో కోర్టుల్లో పెండింగ్‌లో 21.22 లక్షల కేసులు పెండింగులో ఉన్నాయి. వీటిలో 83,536 కేసులు మాత్రమే పరిష్కారమయ్యాయి. అదేవిధంగా గత 2005లో 40,998 మంది మహిళలు ఆత్మహత్య చేసుకోగా, 2011 నాటికి ఈ సంఖ్య 47,746కు చేరింది. 2021 నాటికి ఈ సంఖ్య 45,026కు తగ్గింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హారర్ చిత్రం రా రాజా ఎలా ఉందంటే.. రా రాజా రివ్యూ

పింటు కి పప్పీ మైత్రి మూవీ మేకర్స్ ద్వారా కిస్ కిస్ కిస్సిక్ గా విడుదల

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ జాక్ నుంచి ఫస్ట్ సింగిల్ పాబ్లో నెరుడా రిలీజ్

మైండ్ స్పేస్ ఎకో రన్ లో ఆకట్టుకున్న సంతాన ప్రాప్తిరస్తు టీజర్

ఎన్నో కష్టాలు పడ్డా, ల్యాంప్ సినిమా రిలీజ్ కు తెచ్చాం :చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

ప్రతిరోజూ పసుపు, జీలకర్ర నీటిని తీసుకుంటే..? మహిళల్లో ఆ సమస్యలు మాయం

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments