Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి తలసాని భారీ బైక్ ర్యాలీ

Webdunia
మంగళవారం, 8 డిశెంబరు 2020 (17:27 IST)
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. మంగళవారం రైతులకు మద్దతుగా నిర్వహించిన భారత్ బంద్ లో  మంత్రి, టీఆరెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద నుండి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ  మొండా మార్కెట్, ప్యారడైజ్, రసూల్ పురా, సింధ్ కాలనీ, రాణి గంజ్, ట్యాంక్ బండ్, లిబర్టీ, ఆబిడ్స్, కోఠి, కాచిగూడ, అంబర్ పేట, తిలక్ నగర్ నల్లకుంట,ఇందిరా పార్క్, ఐ మ్యాక్స్, ఎన్టీయార్ భవన్, కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియం, బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ ల మీదుగా సనత్ నగర్ బస్ స్టాండ్ వరకు బైక్ ర్యాలీ కొనసాగింది.

ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ టీఆరెస్ పార్టీ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, కూన వెంకటేష్ గౌడ్, కార్పొరేటర్ లు కొలన్ లక్ష్మీ,  కురుమ హేమలత, నామన శేషుకుమారి, అత్తిలి అరుణ, ఆకుల రూప, తరుణి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments