టీఆర్ఎస్‌తో కిషన్‌రెడ్డికి మ్యాచ్ ఫిక్సింగ్: ఎంపీ రేవంత్

Webdunia
మంగళవారం, 27 అక్టోబరు 2020 (18:20 IST)
బీజేపీకి తన వరకు వస్తే గాని తత్వం బోధపడలేదని మల్కాజిగిరి ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ తన బుట్టలోనిదే అని బీజేపీ ఇన్నిరోజులు భావించిందని, బీజేపీలో కేసీఆర్ అనుకూల, వ్యతిరేక వర్గాలున్నాయని రేవంత్‌రెడ్డి అన్నారు.

బండి సంజయ్‌ను మురళీధర్‌రావు, విద్యాసాగర్ రావు ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. కలెక్టర్, సీపీని పిలిచి సమీక్షించే అధికారం ఉన్నా కిషన్‌రెడ్డి ఆ పనిచేయలేదని విమర్శించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విచారణకు ఎందుకు అదేశించలేదన్నారు.

‘‘టీఆర్ఎస్‌తో కిషన్‌రెడ్డికి మ్యాచ్ ఫిక్సింగ్ ఏంటి? డబ్బులు ఉంటే సోదాలు చేయాల్సింది ఆదాయపన్ను శాఖ.. పోలీసులకు సోదాలు చేసే అధికారం ఎక్కడిది? రఘురామరాజుకు సెక్యూరిటీ ఇచ్చిన కేంద్రం.. తమ సొంత ఎంపీ, రాష్ట్ర అధ్యక్షుడికి ఎందుకు ఇవ్వలేదు?

సంజయ్‌ను మొదటిసారి కొట్టినప్పుడు పోలీసులపై చర్యలు తీసుకోలేదు కాబట్టే.. చంపేందుకు మళ్లీ ప్రయత్నం చేశారు’’ అని ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Roshan: ఛాంపియన్: షూటింగ్లో కొన్ని గాయాలు అయ్యాయి : రోషన్

Kokkoroko: రమేష్ వర్మ నిర్మాణ సంస్థ చిత్రం కొక్కోరొకో షూటింగ్ పూర్తి

మైథలాజికల్ రూరల్ డ్రామా కథ తో అవినాష్ తిరువీధుల .. వానర సినిమా

Sridevi Appalla: బ్యాండ్ మేళం... ఎవ్రీ బీట్ హేస్ ఎన్ ఎమోషన్ అంటోన్న శ్రీదేవి అపళ్ల‌

శంబాలా సినిమా చాలా డిఫరెంట్ కథ, సక్సెస్ కొట్టబోతున్నాం: నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జిమ్‌లో అధిక బరువులు ఎత్తితే.. కంటి చూపుపోతుందా?

winter beauty tips, కలబందతో సౌందర్యం

గుంటూరులో ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు

కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గేందుకు సాయపడే అలసందలు

కేన్సర్ ముందస్తు నిర్ధారణ పరీక్ష... ఖర్చు ఎంతంటే?

తర్వాతి కథనం
Show comments