Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడున్నరేళ్ళ పాపపై లైంగికదాడికి చేసిన వలస కార్మికుడు... అరెస్టు

Webdunia
ఆదివారం, 11 జులై 2021 (09:21 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చ‌ల్ జిల్లా దమ్మాయిగూడ‌లో మూడున్న‌రేళ్ల పాపను కిడ్నాప్ చేసి.. ఆపై లైంగిక దాడికి పాల్ప‌డిన కేసులో అసలు నిందితుడుని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు వారం రోజుల రాచకొండ పోలీసులు ఆ కామాంధుడిని గుర్తించి పట్టుకున్నారు. అభంశుభం తెలియని చిన్నారిపై ఘోరానికి ఒడిగ‌ట్టిన ఒడిశాకు చెందిన వలస కార్మికుడు అభిరామ్ దాస్ (40)గా గుర్తించారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, దమ్మాయిగూడకు చెందిన మూడున్నరేళ్ళ చిన్నారి ఈ నెల 4వ తేదీ సాయంత్రం మొదటి బాధితురాలిని కిడ్నాప్ చేసిన వలస కార్మికుడు అభిరామ్ దాస్ .. చిన్నారిని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి, రాత్రి సమయంలో అత్యాచారం చేసిన‌ట్టుగా పోలీసులు గుర్తించారు. మరుసటి రోజు ఉదయం ఆమెను ద‌మ్మాయిగూడ‌లోని వాటర్ ట్యాంక్ దగ్గర వదిలి పారిపోయాడు.
 
 బాలిక ఏడుపు గమనించిన స్థానికులు ఆమె తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాలికపై లైంగిక వేధింపులకు గురైందని వైద్య పరీక్షలో తేలింది. దీంతో నిందితుడి కోసం నాలుగు రోజులుగా గాలిస్తుండ‌గా.. నాగారం అట‌వీ ప్రాంతంలో ప‌ట్టుబ‌డ్డాడ‌ని పోలీసులు తెలిపారు.
 
ఇదిలావుంటే, ఈ నెల 9వ తేదీన అదే ప్రాంతంలో మరో తొమ్మిదేళ్ళ బాలికను లైంగిక వేధింపులకు గురిచేశాడు. ఈ సంఘటనకు సంబందించిన దృశ్యాలు సీసీ కెమెరాలోకూడా రికార్డ‌య్యాయి. దీంతో ఆదివారం నాటి నేరానికి సంబంధించిన సాంకేతిక ఆధారాలతో పోల్చి చూడ‌గా.. రెండు ఘ‌ట‌న‌ల్లో నిందితుడు ఒకడేన‌ని పోలీసులు నిర్దార‌ణ‌కు వ‌చ్చారు. విచార‌ణ‌లో నిందితుడు నేరం చేసిన‌ట్టుగా అంగీకరించడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pushpa 2 Collection: రూ: 1500 కోట్లకు చేరువలో పుష్ప-2

ఓజీలో ఐటెం సాంగ్ కు సిద్ధమవుతున్న నేహాశెట్టి !

యాక్షన్ థ్రిల్లర్ గా కిచ్చా సుదీప్ మ్యాక్స్ డేట్ ఫిక్స్

డ్రింకర్ సాయి నుంచి అర్థం చేసుకోవు ఎందుకే.. లిరికల్ సాంగ్

రామ్ చ‌ర‌ణ్, కియారా అద్వాణీ కెమిస్ట్రీ హైలైట్ చేస్తూ డోప్ సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

తర్వాతి కథనం