Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిజియోథెరపీ చేస్తా.. ఫిట్‌గా ఉంచుతా.. అమ్మాయిలకు ట్రైనర్ వేధింపులు

Webdunia
ఆదివారం, 11 జులై 2021 (08:51 IST)
తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైకు చెందిన ఓ క్రీడా శిక్షకుడు (ట్రైనర్) పి.నాగరాజన్‌ (59)పై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎక్కువైపోతున్నాయి. ఫిజియోథెరపీ పేరుతో ఆయన లైంగిక వేధింపులకు పాల్పడినట్టు పలువురు బాధిత యువతులు ఆరోపిణలు చేస్తున్నారు.
 
ఇటీవల ఓ మహిళా అథ్లెట్ తనపై కోచ్ నాగరాజన్ గత కొన్నేళ్లుగా లైంగిక దాడులకు పాల్పడుతున్నాడంటూ సంచలన ఆరోపణలు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించగా, మరో ఏడుగురు మహిళా అథ్లెట్లు తమపైనా నాగరాజన్ దారుణాలకు పాల్పడ్డాడంటూ ముందుకు వచ్చారు.
 
దీంతో చెన్నై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మరింతగా లోతుగా విచారణ జరిపారు. ఈ విచారణలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాధారణంగా క్రీడాకారులు గాయపడటం సహజం. ఇదే ఆ కోచ్‌కు మంచి అవకాశంగా మారింది. తన వద్ద శిక్షణ తీసుకునే అమ్మాయిలు గాయపడినపుడు వారికి ‘ఫిజియో థెరపీ’ పేరిట లైంగిక వాంఛ తీర్చుకోసాగాడు. 
 
'ఫిజియోథెరపీ చేస్తాను, ఇది మిమ్మల్ని ఫిట్‌గా ఉంచుతుంది' అంటూ వారికి నచ్చజెప్పి లైంగికదాడికి పాల్పడుతూ వచ్చినట్టు తేలింది. ఒకవేళ తనకు ‘సహకారం’ అందించకపోతే పెద్ద ఈవెంట్లలో పాల్గొనలేరని బెదిరింపులకు దిగుతూ తన లైంగక వాంఛ తీర్చుకుంటూ వచ్చినట్టు వెల్లడైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం