స్నేహం పేరుతో.. స్నేహితుడి భార్యతో ఆ సంబంధం.. రాడ్‌తో?

Webdunia
శుక్రవారం, 8 అక్టోబరు 2021 (14:43 IST)
స్నేహం పేరుతో స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకొని.. చివరికి స్నేహితుడి చేతిలోనే హతుడయ్యాడు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాదులో శ్రీశైలం యాదవ్‌(32), శ్రీకాంత్‌ యాదవ్‌ ఇద్దరూ పాల వ్యాపారం చేస్తుంటారు.
 
దూరపు బంధువుల కావడంతో వీరి మధ్య చాలా ఏళ్లుగా స్నేహం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే శ్రీకాంత్ యాదవ్ తరుచూ శ్రీశైలం యాదవ్ ఇంటికి వచ్చి వెళ్తుండేవారు. దీంతో శ్రీశైలం భార్యతో చనువు పెరిగి అక్రమ సంబంధానికి దారితీసింది.
 
స్నేహితుడు ఇంట్లో లేని సమయంలో శ్రీకాంత్ తరుచూ వస్తూ అతడి భార్యతో రాసలీలలు కొనసాగించేవాడు. ఈ విషయం తెలుసుకున్న శ్రీశైలం.. భార్యను గట్టిగా మందలించాడు. అయినప్పటికీ వారిద్దరి మధ్య సంబంధం కొనసాగుతుండటంతో శ్రీకాంత్‌ను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. 
 
అక్టోబర్ 01న గేదె తప్పిపోయిందని వెతకడానికి రమ్మని పిలిచాడు. ఆపై అతనిని నమ్మించి శ్రీకాంత్‌ను బైక్‌పై వెంట తీసుకెళ్లాడు. ఐడీఎల్‌ కంపెనీకి చెందిన ఖాళీ స్థలంలోకి తీసుకెళ్లి రాడ్‌తో శ్రీకాంత్‌ తలపై బలంగా మోది చంపేశాడు. శ్రీకాంత్ కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. 
 
శ్రీశైలం కూడా ఏమీ ఎరగనట్టుగా అందరితో కలిసి సాధారణంగా తిరిగాడు. అయితే బైక్‌పై తీసుకెళ్లిన శ్రీశైలమే అతడిని ఏదో చేసి ఉంటాడని అనుమానించిన పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. మొదట తనకేమీ తెలియదని చెప్పిన నిందితుడు ఆ తర్వాత నేరాన్ని అంగీకరించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

Balakrishna: చిరంజీవి, బాలక్రిష్ణ సినిమాలు ఆగిపోవడానికి వారే కారకులా!

Naga Shaurya: మాస్ హీరోగా నిలబడేందుకు కష్టపడుతున్న నాగ శౌర్య

Raghav Juyal: నాని ప్యారడైజ్ లో బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్ ప్రవేశం

Prabhas: రాజా సాబ్ ట్రైలర్ కు రెస్పాన్స్ - యూరప్ లో ప్రభాస్ తో రెండు పాటల చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments