Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ ప్రాణం తీసింది.. మెట్టెలు, పుస్తెలతాడును చూసి..?

Webdunia
గురువారం, 11 ఏప్రియల్ 2019 (10:09 IST)
ప్రేమ ప్రాణం తీసింది. ప్రేమికుడిని వివాహం చేసుకుని.. ఒంటరిగా ఇంటికొచ్చిన ఓ యువతిని తల్లిదండ్రులు దూషించడంతో తీవ్ర మనస్తాపం చెందింది. ఇంకా గుట్టుగా ప్రేమ వివాహం చేసుకున్నందుకు తల్లిదండ్రులు తీవ్రస్థాయిలో మందలించడంతో ఆ యువతి మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే... నేరేడుగొమ్ము మండల కేంద్రానికి చెందిన వరికుప్పల శ్రీను-సుజాత కూతురు రూప(21) హైదరాబాద్‌లో నర్సింగ్ శిక్షణ పొందుతూ అక్కడే నాంపల్లి మండలం మల్లరాజుపల్లి గ్రామానికి చెందిన సత్యంను ప్రేమించింది. సత్యం తల్లిదండ్రులు వీళ్ల పెళ్లికి నిరాకరించడంతో గుట్టుగా వివాహం చేసుకుని ఇటీవల స్వగ్రామంలో జరిగిన పండుగకు వచ్చారు. 
 
సత్యం తల్లిదండ్రులు దూషించడంతో ఒంటరిగా నేరేడుగొమ్ములోని తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. మెట్టెలు, పుస్తెలతాడును చూసి తల్లిదండ్రులు సైతం తీవ్రంగా మందలించడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగింది. దేవరకొండ ప్రభుత్వ దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments