కేటీఆర్‌కు కరోనా.. హోమ్ ఐసోలేషన్‌లో కేసీఆర్ ఫ్యామిలీ

Webdunia
శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (09:32 IST)
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. సాధారణ ప్రజలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా కోవిడ్ బారినపడుతున్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్, ఎంపీ సంతోష్ కుమార్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా.. తాజాగా మంత్రి కేటీఆర్‌కు కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చింది. 
 
ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్ వేదికగా ప్రకటించారు. తనకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని.. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నానని పేర్కొన్నారు. ఇటీవల తనను కలిసిన వారంతా కోవిడ్ ప్రొటోకాల్స్ పాటిస్తూ.. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. 
ktramarao
 
మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనాబారినుండి సురక్షితంగా బయటపడాలంటూ టీఆర్ఎస్ నాయకులు, అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల్లో పూజలు, మసీదుల్లో ప్రార్థనలు చేస్తున్నారు. 
 
ఇలా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి కూడా కేసీఆర్ పేరిట ఏడుపాయల వనదుర్గా మాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా మహమ్మారి నుంచి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో పరిపాలన చేపట్టాలని సుభాష్ రెడ్డి దుర్గమ్మను కోరుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

తర్వాతి కథనం
Show comments