Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేటీఆర్ పట్టాభిషేకానికి అద్భుతమైన ముహూర్తం.. రథ సప్తమి రోజునే..?

Webdunia
శుక్రవారం, 22 జనవరి 2021 (09:39 IST)
KCR_KTR
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల తారకరామారావు పేరు ఖాయమైంది. అయితే, ఆయన పట్టాభిషేకం ఎప్పుడనే అంశం మీదే ఇప్పుడు అందరిలోనూ చర్చ జరుగుతోంది. దీని కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ దివ్యమైన ముహూర్తం ఖరారు చేసినట్టు తెలిసింది. ఫిబ్రవరి 18వ తేదీన కేటీఆర్‌ను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్టు సమాచారం. 
 
ఫిబ్రవరి 18న ఎందుకు అంటే ఆ రోజు రథసప్తమి. హైందవ సంప్రదాయంలో రథసప్తమికి చాలా ప్రత్యేకత ఉంది. దీన్ని సూర్యజయంతి, వైవస్వత మన్వాది అని కూడా పిలుస్తారు. ప్రత్యక్ష భగవానుడు సూర్యుడు పుట్టిన రోజుగా దీనికి చాలా ప్రాముఖ్యం ఉంది. ఆ రోజు చేపట్టే పనులు దిగ్విజయంగా కొనసాగుతాయని నమ్మకం. అలాంటి రోజున కేటీఆర్‌కు ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేయడానికి ముహూర్తం ఖరారు చేసినట్టు సమాచారం. 
 
ఫిబ్రవరి 18, ఫిబ్రవరి 19న రెండు రోజులు కూడా సప్తమి తిథి ఉంది. ఒకరోజు ఎక్కువ సమయం, మరో రోజు తక్కువ సమయం ఉంది. అలాగే, ఫిబ్రవరి 19వ తేదీన ఛత్రపతి శివాజీ జయంతి. రెండు కలసి వచ్చేలా ఫిబ్రవరి 19న కూడా చేసే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

పదిమందికి పని కల్పించడంలో చాలా ఆనందం వుంది: నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల

ఆసక్తికి రేకెత్తిస్తున్న వరుణ్ సందేశ్ - నింద పోస్టర్

గుడిని మూసేయండి అంటున్న సీతా కళ్యాణ వైభోగమే టీజర్‌- మంత్రి కోమటి రెడ్డి ఆవిష్కరణ

గ్రామీణ కథతో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా చిత్రం

తమన్నా భాటియా, రాశి ఖన్నా నటించిన బాక్ సినిమా వాయిదా

టొమాటో రసం తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

రోగనిరోధక శక్తిని పెంచే 4 సహజ ఆహారాలు

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించే పదార్థాలు ఏమిటి?

పొద్దుతిరుగుడు విత్తనాలు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

క్యారెట్ రసం ఎందుకు తాగుతారో తెలుసా?

తర్వాతి కథనం
Show comments