ఖమ్మంలో ఉద్రిక్తత : బీజేపీ కార్యకర్త ఆత్మహత్య కేసులో కీలక సాక్ష్యం

Webdunia
ఆదివారం, 17 ఏప్రియల్ 2022 (13:11 IST)
ఖమ్మంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజీపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్య కేసు దీనికి కారణంగా మారింది. ఈ జిల్లాకు చెందిన తెరాస మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పెట్టిన టార్చర్ కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్టు బీజేపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై బీజేపీ క్యాడర్‌కు తెరాస కార్యకర్తలు, నేతలు, పోలీసులకు మధ్య తీవ్రస్థాయిలో మాటలయుద్ధం సాగుతోంది. ఈ నేపథ్యంలో సాయిగణేష్ ఆత్మహత్య కేసులో సాక్ష్యం చెప్పేందుకు ఓ కార్యకర్త ఒకరు ముందుకు వచ్చారు. 
 
బీజేపీలో కీలక కార్యకర్తగా ఉండే సాయి గణేష్ ప్రభుత్వాన్ని నిత్యం విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. పైగా, వచ్చే నెల నాలుగో తేదీన పెళ్లి కావాల్సివుంది. ఇంతలోనే సాయిగణేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపిస్తున్నారు. పోలీసులు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, అందుకే సాయిగణేష్ పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నారని బీజేపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. 
 
మంత్రి పువ్వాడ అజయ్ వేధింపులతోనే పురుగుల మందు తాగినట్టు సాయిగణేష్ చెప్పాడు. మంత్రి ఆగడాలు ఎక్కవయ్యాయని… పోలీసులను గుప్పిట్లో పెట్టుకొని తనను టార్చర్ పెట్టాడని అన్నాడు. టార్చర్ తట్టుకోలేకే ఆత్మహత్య యత్నం చేశానన్నారు.
 
సాయిగణేష్‌పై ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 16 కేసులు పెట్టారు పోలీసులు. అంతేకాదు పీడీ యాక్ట్‌ నమోదు చేసి రౌడీ షీట్ ఓపెన్‌ చేశారు. సాధారణంగా దోపిడీలు, హత్యలు చేసేవాళ్లు, పదే పదే నేరాలకు పాల్పడేవారిపై పీడీ యాక్ట్‌, రౌడీ షీట్‌ ఓపెన్‌ చేస్తారు. 
 
కానీ, బీజేపీ కార్యకర్త అయిన సాయిగణేష్‌పై పోలీసులు ఎందుకు ఇలాంటివి నమోదు చేశారన్నది చర్చనీయాంశంగా మారింది. ఇదంతా మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ ప్రమేయంతోనే జరిగిందని బీజేపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prerna Arora: హిందీ లోనే కాక దక్షినాది లో కూడా ఆదరణ పొందుతున్న ప్రేరణ అరోరా

Kiran Abbavaram: చెన్నై లవ్ స్టోరీ సినిమా కంటెంట్ పై కాన్ఫిడెంట్ : కిరణ్ అబ్బవరం

Suriya4: సూర్య, నజ్రియా నజీమ్ చిత్రం షూటింగ్ షెడ్యూల్‌ ప్రారంభమైయింది

Drishyam 3: దృశ్యం 3 వంటి కథలు ముగియవు - పనోరమా స్టూడియోస్, పెన్ స్టూడియోస్‌

SS thaman: ఎస్ థమన్ ట్వీట్.. తెలుగు సినిమాలో మిస్టీరియస్ న్యూ ఫేస్ ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments