Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తోటి ఉపాధ్యాయురాలిపై కీచక టీచర్ అత్యాచారం.. కారులో ఎక్కించుకుని?

Advertiesment
Khammam Teacher
, శుక్రవారం, 25 మార్చి 2022 (18:00 IST)
మహిళలపై అకృత్యాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఇంటా బయటా ఎక్కడపడితే అక్కడ మహిళలపై అత్యాచారాలు, వేధింపులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా  తోటి ఉపాధ్యాయురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆమెని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో కేసు వెలుగు చూసింది. నిందితుడు పరారీలో ఉన్నాడు. 
 
వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు నమ్మించి, బెదిరించి మరో ఉపాధ్యాయురాలిని మోసం చేసి అత్యాచారం చేశాడు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం అంకన్నగూడెం ప్రభుత్వ పాఠశాలలో ఎస్జీటీ టీచర్‌గా పనిచేస్తున్న బానోతు కిషోర్ అదే మండలంలో మరో పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని నమ్మించి, తనతో పాటు తీసుకెళ్లి ,బెదిరింపులకు పాల్పడి అత్యాచారం చేశాడు.
 
కిషోర్ తాను మండల పిఆర్టీయు నాయకుడు అని కూడా చెబుతూ భయబ్రాంతులకు పాల్పడ్డాడు. కిషోర్ అతడి భార్య కూడా ఇదే మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఈ భార్యాభర్తలు ప్రతిరోజు ఖమ్మం నుండి తమ కారు ద్వారా గార్ల మండలానికి వెళ్తూ వస్తుండేవారు. ఈ క్రమంలో వారి మధ్య పరిచయం కూడా ఉంది. ఒకరోజు భార్యాభర్తలు బాధిత మహిళను కారులో ఎక్కించుకుని వెళ్లారు. 
 
ఇష్టం లేకపోయినా వారి బలవంతం మీద కారులో ఒకటి రెండుసార్లు ఆమె ఖమ్మంకు వచ్చింది. బాధిత మహిళ మీద కన్నేసిన కిషోర్ అవకాశం కోసం ఎదురుచూశాడు. ఈనెల 17వ తేదీన సాయంత్రం ఆమె ఒంటరిగా గార్ల రైల్వే స్టేషన్ లో రైలు కోసం నిలబడి ఉంది. ఇదే అదునుగా భావించి, తాను తన భార్య కారులో పోతున్నామని ఖమ్మంలో దింపుతామని, చెప్పటంతో బాధిత మహిళా టీచర్ కిషోర్ కారు ఎక్కింది.
 
ఆ వెంటనే అతడి భార్య గురించి అడగ్గా వచ్చే స్టేజీలో ఎక్కుతుందని నమ్మించాడు. ఆ విధంగా పై స్టేజ్లో ఆపై స్టేజ్లో తన భార్య కారు ఎక్కు తుందని నమ్మించాడు. ఖమ్మం నగరంలోని పాండురంగాపురం ప్రాంతంలో గల ఒక ఇంట్లోకి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఈ విషయం ఎవ్వరికైనా చెబితే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో మహిళ ధైర్యం చేసి రెండు రోజుల తరువాత భర్తకు సమాచారం ఇచ్చింది. ఖమ్మం అర్బన్ పోలీసు స్టేషన్లో భార్యాభర్తలు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

2022-2023 బడ్జెట్‌కు ఏపీ సర్కారు ఆమోదం