Webdunia - Bharat's app for daily news and videos

Install App

కెసిఆర్‌కి ప్రధాని ఛాన్స్... ఎంపి కవిత

Webdunia
సోమవారం, 31 డిశెంబరు 2018 (17:19 IST)
తెలంగాణాలో కుటుంబ పాలన ఎక్కువైపోయిందంటూ ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతలైతే కెసిఆర్, కెటిఆర్, హరీష్ రావు, కవితలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ప్రతిపక్షాల విమర్శలను పెద్దగా పట్టించుకోని కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ వైపు ప్రత్యేక దృష్టి పెట్టారు. తెలంగాణాలో టిఆర్ఎస్ భారీ విజయం తరవాత కెసిఆర్ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
 
ఇప్పటికే పశ్చిమబెంగాల్‌కు వెళ్ళి మమతా బెనర్జీని కలిశారు కెసిఆర్. ఫెడరల్ ఫ్రంట్‌ను విస్తరించే దిశగా ముందుకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో నిజమాబాద్ ఎంపి కల్వకుంట కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫెడరల్ ఫ్రంట్ పైన నమ్మకం ఏర్పడి దేశ రాజకీయాల్లో కెసిఆర్ చక్రం తిప్పడం ఖాయమని, త్వరలోనే కెసిఆర్ ప్రధాని అయ్యే అవకాశం కూడా ఉందన్నారామె. 
 
తెలంగాణా రాష్ట్రంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను దేశ ప్రజలు గమనిస్తున్నారని, ప్రాంతీయ పార్టీలన్నీ ఐక్యమై ముందుకు సాగే తరుణం ఆసన్నమైందని ఆమె చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments