Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మార్ట్‌ఫోన్ చూస్తూ బస్సు నడిపిన డ్రైవర్.. ఆ ఫోనులో ఇంతకీ ఏం చూశాడో?

Webdunia
సోమవారం, 31 డిశెంబరు 2018 (16:19 IST)
స్మార్ట్‌ఫోన్‌లు లేకుండా క్షణం కూడా వుండలేకపోతున్నారు.. చాలామంది. కానీ స్మార్ట్‌ఫోన్‌ వాడటం తప్పులేదు కానీ సెల్ఫీలు తీసుకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న వారు కొందరైతే.. మరికొందరు సెల్ ఫోన్లలో మాట్లాడుతూ.. సెల్ ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలను కొనితెస్తున్నారు. ఇందులో భాగంగా తమిళనాడులో రామనాథపురం నుంచి పుదుక్కోట్టై వెళ్లే ప్రభుత్వ బస్సు డ్రైవర్ ఇదే పని చేశాడు. 
 
పుదుక్కోట్టైకి చెందిన బస్సు డ్రైవర్.. ఒక్క నిమిషం కూడా స్మార్ట్‌ఫోన్‌ను పక్కన పెట్టకుండా డ్రైవింగ్ చేశాడు. ఒక్క చేత్తో స్మార్ట్‌ఫోన్ చూస్తూ మరో చేతిలో డ్రైవింగ్ చేశాడు. రోడ్డును చూడకుండా సెల్‌ఫోన్‌ను చూస్తూ డ్రైవింగ్ చేసిన డ్రైవర్‌పై ప్రయాణీకులు మండిపడుతున్నారు. 
 
కొందరు డ్రైవర్ నిర్లక్ష్య డ్రైవింగ్‌ను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇలాంటి డ్రైవర్లకు బుద్ధి చెప్పాలంటే 2పాయింట్ఓ పక్షిరాజా (అక్షయ్ కుమార్) రావాలని సెటైర్లు వేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments