Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని తీసుకొచ్చాడు... అవసరం తీరాక అలా ప్రోత్సహించాడు...

Advertiesment
పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని తీసుకొచ్చాడు... అవసరం తీరాక అలా ప్రోత్సహించాడు...
, శనివారం, 29 డిశెంబరు 2018 (16:47 IST)
అప్పుడే యవ్వనంలో కాలుపెట్టి అందమైన ఊహాలోకంలో తిరుగుతుంటారు యువతీయువకులు. అలాంటి అమాయక వయసులో కొందరు దారి మళ్లించి వారి జీవితాలను నాశనం చేస్తుంటారు. తాజాగా కాలేజీలో చదువుకుంటూ వున్న ఓ యువతికి గాలం వేసాడో యువకుడు. ప్రేమ అంటూ ఆమెకి తీపి కబుర్లు చెప్పాడు. ఆమె అతడిని గుడ్డిగా నమ్మేసింది. అంతే... ఆమె జీవితం అంతమైంది.
 
మరిన్ని వివరాలను పరిశీలిస్తే... వేలూరికి చెందిన వేలు అనే యువకుడు, కడలూరికి చెందిన ఇళవరసిని ప్రేమలో దింపాడు. ఆమె వెంట పడుతూ నీవు లేనిదే నేను బ్రతకలేను అంటూ కబుర్లు చెప్పాడు. ఆమె అతడి మాటలు నమ్మేసింది. ఐతే ఆమె కాలేజీ చదువు ముగిసేవరకూ ప్రేమ అంటూ ఆమెతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూనే వున్నాడు. చదువు ముగుస్తుందనగానే ఆమెకి పెళ్లి చేసేందుకు పెద్దలు నిశ్చయించారు. ఈ విషయం తెలుసుకున్న సదరు యువకుడు ఆమెను తనతో వచ్చేయమన్నాడు. 
 
అతడి మాటలు నమ్మి వెళ్లింది ఆమె. కొన్నాళ్లు మధురవాయిల్ ప్రాంతంలో ఓ ఇల్లును అద్దెకి తీసుకుని భార్యాభర్తలమంటూ చేరారు. అలా కొన్నాళ్లు గడిచాక ఆమె ముందు అసలు నిజం చెప్పాడు. తనకు పెళ్లయిందనీ, ఇద్దరు పిల్లలున్నారని వెల్లడించాడు. అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటానని చెప్పడంతో పాటు, ఈ విషయం బయటకు తెలిస్తే మనల్ని చంపేస్తారనీ, అంతకంటే మనమే చచ్చిపోవడం మంచిదంటూ ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించడం ప్రారంభించాడు. అతడిచ్చిన షాక్‌కి అటు కన్నవారి ఇంటి గడప తొక్కలేక... ఇటు పెళ్లయినవాడితో వుండలేక ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దిలీప్ భుజంపై చెయ్యేసేసరికి గుండె వేగంగా కొట్టుకుంది.. నవ్యా నాయర్