మా కెసిఆర్‌‌కు ఆ కళ వచ్చేసిందని తెలంగాణ ప్రజలు చెప్పుకుంటున్నారా?

బిజెపికి, కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రెంట్ ఏర్పాటు చేస్తానంటూ రాష్ట్రాలు పట్టుకుని తిరుగుతున్న తెలంగాణా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు అప్పుడే ప్రధానమంత్రి కళ వచ్చేసినట్లుంది. తెలంగాణా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న రైతుబంధు పథకానికి సం

Webdunia
శుక్రవారం, 11 మే 2018 (15:05 IST)
బిజెపికి, కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రెంట్ ఏర్పాటు చేస్తానంటూ రాష్ట్రాలు పట్టుకుని తిరుగుతున్న తెలంగాణా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు అప్పుడే ప్రధానమంత్రి కళ వచ్చేసినట్లుంది. తెలంగాణా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న రైతుబంధు పథకానికి సంబంధించి పత్రికలకు ఇచ్చిన ప్రకటనలను చూస్తే కెసిఆర్ దేశ ప్రజలను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. రైతులకు పంటల సాగుకోసం యేడాదికి 8 వేల రూపాయలు ఇచ్చే రైతు బంధు పథకాన్ని ప్రవేశపెడుతున్న కెసిఆర్ దాన్ని దేశ వ్యాప్తంగా ప్రచారం చేసుకుంటున్నారు.
 
తెలుగు పత్రికలకు రెండు పేజీలు పూర్తి ప్రకటనలు ఇచ్చిన ఆయన తమిళనాడు, కర్ణాటక, కేరళ, బెంగాళ్ ఇలా ఏ రాష్ట్రాన్ని విడిచిపెట్టకుండా భారీ ప్రకటనలు ఇచ్చారు. దేశ రైతాంగానికి స్వర్ణయుగం అనే శీర్షికతోనే ఈ ప్రకటనలు వచ్చాయి. తెలంగాణా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఈ పథకం దేశంలోని అన్ని రాష్ట్రాలూ అమలు చేయాల్సిన పరిస్థితి వస్తుందని రాజకీయ విశ్లేషకులు చలోక్తులు విసురుకుంటున్నారు. 
 
తను ప్రధానమంత్రి అయితే ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టగలమని దేశ ప్రజలకు చెప్పడం కావచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తను భవిష్యత్తులో చేయబోతున్న ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలకు దీన్ని అవకాశంగా ఉపయోగించుకున్నారు. ఈ ప్రకటనల్లో కెసిఆర్ ఫోటో తప్ప వ్యవసాయమంత్రి ఫోటో కూడా లేదు. దీనికి కారణం దేశ వ్యాప్తంగా కెసిఆర్ ఫోకస్ కావాలనుకోవడమే కావచ్చట. ఏమైనా అప్పుడే కెసిఆర్‌లో ప్రధానమంత్రి కళ వచ్చేసిందంటూ తెలంగాణా రాష్ట్ర ప్రజలు మాట్లాడేసుకుంటున్నారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments