Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ పథకం ఫట్... బతుకమ్మ చీరెలన్నీ గోడౌన్లలోనే...

టీఆర్ఎస్ ప‌క్కా ప్లాన్‌తో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు రెడీ అయి శాస‌న‌స‌భ‌ను ర‌ద్దు చేసింది. అయితే… టీఆర్ఎస్ చ‌ట్టస‌భ‌ను ర‌ద్దు చేసిన త‌ర్వాత త‌మ పార్టీ త‌రుపున పోటీ చేసే అభ్య‌ర్ధుల పేర్లు కూడా ప్ర‌క‌టించింది.

Webdunia
శుక్రవారం, 5 అక్టోబరు 2018 (17:39 IST)
టీఆర్ఎస్ ప‌క్కా ప్లాన్‌తో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు రెడీ అయి శాస‌న‌స‌భ‌ను ర‌ద్దు చేసింది. అయితే… టీఆర్ఎస్ చ‌ట్టస‌భ‌ను ర‌ద్దు చేసిన త‌ర్వాత త‌మ పార్టీ త‌రుపున పోటీ చేసే అభ్య‌ర్ధుల పేర్లు కూడా ప్ర‌క‌టించింది. దీనిని బ‌ట్టి అర్ధం చేసుకోవ‌చ్చు ఎంత ప్లాన్‌తో ఉందో. అయితే.. ముందుగా పార్టీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌డంతో కొంతమంది అసంతృప్తులు ఎదురుతిరిగారు. దీంతో ఓవైపు అసంతృప్తులను నుంచి షాక్ త‌గులుతుంటే… మ‌రోవైపు ఎన్నిక‌ల క‌మీష‌న్ నుంచి షాక్ త‌గులుతూనే ఉంది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. ఎన్నిక‌ల కోడ్ వ‌ల‌న టీఆర్ఎస్ ప్లాన్ చేసుకున్న చీర‌ల పంపిణి కార్య‌క్ర‌మానికి బ్రేక్ ప‌డింది. మ‌హిళ‌ల కోసం 96 ల‌క్ష‌ల చీర‌ల‌ను పంపిణీ చేయాల‌నుకున్నారు.
 
280 కోట్ల రూపాయ‌ల‌తో ఖ‌రీదు చేసిన ఈ చీర‌ల‌ను బ‌తుక‌మ్మ చీర‌ల ప‌థ‌కం కింద పంపిణీ చేయాల‌నుకున్నారు టీఆర్ఎస్ నేత‌లు. అయితే… తెలుగుదేశం, కాంగ్రెస్ నేత‌లు ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేయ‌డంతో ఈ పంపిణీ కార్య‌క్ర‌మానికి బ్రేక్ ప‌డింది. గ‌త సంవ‌త్స‌రం ప్ర‌క‌టించిన ప‌థ‌కం క‌దా.. ఇబ్బంది ఉండ‌దు అనుకుంది టీఆర్ఎస్. కానీ ఎన్నిక‌ల సంఘం అనుమ‌తి ఇవ్వ‌క‌పోవ‌డంతో... ప్ర‌తిప‌క్షాల ప్లాన్ ఫ‌లించింది. టీఆర్ఎస్ ప్లాన్ ఫెయిల్ అయ్యింది. అయితే... చీర‌ల పంపిణికి బ్రేక్ ప‌డ‌టాన్ని టీఆర్ఎస్ మ‌రోలా వాడుకోవాలి అనుకుంటుంద‌ట‌.
 
ఎలా అంటే.. టీఆర్ఎస్ మ‌హిళా నేత‌లు కాంగ్రెస్, టీడీపీ వ‌ల్ల‌నే చీర‌ల పంపిణీకి బ్రేక్ ప‌డింది అని  ప్ర‌చారం చేస్తూ జ‌నంలోకి తీసుకెళుతున్నారు. ఈ విధంగా చీర‌ల రాజ‌కీయం చేస్తోంది టీఆర్ఎస్. మ‌రి.. ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డంలో స‌క్స‌స్ అవుతుందేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments