చంద్రబాబుతో కలిసి రొయ్యల పులుసు తిన్నప్పుడు గుర్తురాలేదా కేసీఆర్?
చంద్రబాబుతో పొత్తును నిజామాబాద్ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్. కేటీఆర్ ఆంధ్ర కాంట్రాక్టర్లతో కలిసి తిరుగుతుంది నిజం కాదా?
చంద్రబాబుతో పొత్తును నిజామాబాద్ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్. కేటీఆర్ ఆంధ్ర కాంట్రాక్టర్లతో కలిసి తిరుగుతుంది నిజం కాదా? చంద్రబాబుతో రొయ్యల పులుసు తిన్నప్పుడు గుర్తురాలేదా? అమరావతిలో కేసీఆర్... చంద్రబాబుకు వంగి సలామ్ కొట్టింది నిజం కాదా? అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
చంద్రబాబు 7 మండలాలను లాక్కొంటే... నీవు సీఎంగా ఉండి ఏడు మండలాలు ఎందుకు అడ్డుకోలేకపోయావు? అంటూ కేసీఆర్‌ని తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ భవిష్యత్ కోసం ఏర్పడే వేదికనే మహాకూటమి అని కేసీఆర్‌కు ముందస్తు భస్మాసుర హస్తమేనన్నారు. ఈ కూటమిని చూసి కేసీఆర్ భయపడుతున్నారని అన్నారు మధు యాష్కీ. కాపలా కుక్కలా ఉంటానన్న కేసీఆర్... నేడు కాటేసే నక్కలా మారాడంటూ ఫైర్ అయ్యారు.
దేశం కోసం పనిచేసిన చరిత్ర మా ఉత్తమ్‌కుమార్‌ది అయితే.. కానీ నీ బతుకు దుబాయ్ మామ బతుకంటూ సెటైర్లు వేశారు మధు యాష్కీ. ఇప్పటికైనా కేసీఆర్ సంస్కారంతో మాట్లాడాలని... లేదంటే మేం కూడా అదే రేంజ్‌లో సమాధానం చెబుతామని హెచ్చరించారు.