అడుక్కుంటే నేను ఇస్తాను.. నాలుగు సీట్లు.. బాబుతో పొత్తా?: కేసీఆర్
ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ టీడీపీతో తెలంగాణలో పొత్తు పెట్టుకోవడంపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబుతో పొత్తు కలుస్తారా? థూ.. మీ బతుకులు చెడ అంటూ తీవ్రస్థాయి
ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ టీడీపీతో తెలంగాణలో పొత్తు పెట్టుకోవడంపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబుతో పొత్తు కలుస్తారా? థూ.. మీ బతుకులు చెడ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మీ బతుకులకు అడుక్కుంటే తాను నాలుగు సీట్లు ఇస్తాను కదా అంటూ ఎద్దేవా చేశారు.
నిజామాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. ఇవొక బతుకులా.. ఎవడైతే తెలంగాణను నాశనం చేశాడో, గుండు కొట్టిండో.. చంద్రబాబుతో పొత్తా? అని ప్రశ్నించారు. దయచేసి, తెలంగాణ మేథావులకు, పెద్దలకు నేను మనవి చేస్తున్నా.. మళ్లీ ఆంధ్రోళ్లకు అప్పగిస్తారా అధికారం? తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకెట్టు పెడతారా? కాంగ్రెస్ పార్టీ వాళ్లు పరాన్న భుక్కులు.. వీళ్ల చేతుల్లో ఏమీ ఉండదని కేసీఆర్ నిప్పులు చెరిగారు.
కాంగ్రెస్ నాయకులు చెబుతున్న సొల్లు పురాణాలు, పిచ్చికూతలు టీ-కాంగ్రెస్ నేతలు స్తున్నారని మండిపడ్డారు. ఈ సభకు జన ప్రభంజనాన్ని తాను ఏనాడూ చూడలేదని, కేసీఆరే మా పెద్ద కుమారుడని ప్రతి ఇంట్లో ఆశీర్వదిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పాలనలో ఉన్న రూ.200 పింఛన్‌ను రూ.1000కి పెంచిన ఘనత తమదేనని, పేదల పింఛన్‌లను మళ్లీ పెంచుతామని, పింఛన్ ఎంతో మ్యానిఫెస్టో కమిటీ నిర్ణయిస్తుందని తెలిపారు. రాబోయే మూడు నెలలలో ఇంటింటికీ మిషన్ భగీరథ తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు.