Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టీఆర్ఎస్ డబ్బులిస్తే తీస్కుని హస్తానికి ఓటెయ్యండి... విజ‌య‌శాంతి

కేసీఆర్ నిజమాబాద్ బ‌హిరంగ స‌భ‌లో తెలుగుదేశం, కాంగ్రెస్ నాయ‌కులపై విమ‌ర్శ‌లు చేయ‌డం తెలిసిందే. అయితే.. కేసీఆర్ చేసిన‌ విమ‌ర్శ‌లపై కాంగ్రెస్ నాయ‌కులు ఘాటుగానే స్పందించారు.

Advertiesment
టీఆర్ఎస్ డబ్బులిస్తే తీస్కుని హస్తానికి ఓటెయ్యండి... విజ‌య‌శాంతి
, గురువారం, 4 అక్టోబరు 2018 (20:42 IST)
కేసీఆర్ నిజమాబాద్ బ‌హిరంగ స‌భ‌లో తెలుగుదేశం, కాంగ్రెస్ నాయ‌కులపై విమ‌ర్శ‌లు చేయ‌డం తెలిసిందే. అయితే.. కేసీఆర్ చేసిన‌ విమ‌ర్శ‌లపై కాంగ్రెస్ నాయ‌కులు ఘాటుగానే స్పందించారు. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత జానారెడ్డి స్పందిస్తూ... కేసీఆర్‌కు అబ‌ద్దాలు ఆడ‌డం అల‌వాటే. మేమే నాలుగైదు సీట్లు ఇచ్చాం. నువ్వా మాకు సీట్లు ఇచ్చేది అని ప్ర‌శ్నించారు. 
 
తెలంగాణ‌లో కాంగ్రెస్ గెలుపు ఖాయం. రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం గ‌జ దొంగ‌ల్లా దోచుకున్నార‌ని ఆరోపించారు. హామీల‌ను నిల‌బెట్టుకోలేని వాళ్ల‌ను హైద‌రాబాద్‌లో బ‌ట్టెబాజ్ అంటారు. మేం అధికారంలోకి వ‌చ్చాకా ఏక కాలంలో 2 ల‌క్ష‌ల రుణ మాఫీ చేస్తాం అని టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అన్నారు. 
 
కాంగ్రెస్ కేసీఆర్ లాంటి దొర‌ల‌ను త‌రిమికొట్టింది. కేసీఆర్ వ్యాఖ్య‌ల‌కు భ‌య‌ప‌డం. తెలంగాణ‌ను 
కేసీఆర్ కుటుంబం దోచుకుంటోంది. ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తే చూస్తూ ఊరుకోం. టీఆర్ఎస్ డ‌బ్బులిస్తే తీసుకుని కాంగ్రెస్ పార్టీకి ఓటేయ్యండి అని కాంగ్రెస్ పార్టీ నాయ‌కురాలు విజ‌య‌శాంతి అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాహుబలి కిలికిరి సైన్యంలా ఏపీలో బీజేపీ: డొక్కా వ్యాఖ్య