Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరుడు సంతోష్ బాబు భార్యకు డిప్యూటీ కలెక్టర్, 711 గజాల ఇళ్ల స్థలం

Webdunia
బుధవారం, 22 జులై 2020 (23:04 IST)
చైనా సరిహద్దులో పోరాడుతూ అమరుడు అయిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం చేయూత  అందించింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో కేబీఆర్ పార్కుకు ఎదురుగా ఉన్న విలువైన 711 గజాల స్థలం కేటాయించింది.
 
కల్నల్ సంతోష్ కుటుంబ సభ్యుల కోరిక మేరకు బంజారా హిల్స్‌లో స్థలం కేటాయింపు జరిపింది. సంతోష్ బాబు సతీమణికి ఇంటి స్థలం పత్రాలను హైదరాబాద్ కలెక్టర్ శ్వేత మహంతి తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ అందించారు. సంతోష్ బాబు భార్య సంతోషికి ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇస్తూ దీనికి సంబంధించిన ఉత్తర్వులను ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతి భవన్లో అందించారు.
 
సంతోషికి హైదరాబాద్, పరిపర ప్రాంతాల్లోనే పోస్టింగ్ ఇచ్చి, సరైన శిక్షణ ఇప్పించి, ఉద్యోగంలో కుదరుకునే వరకు తోడుగా ఉండాలని సిఎం తన కార్యదర్శి స్మితా సభర్వాల్‌ను కోరారు. సంతోషితో పాటు వచ్చిన 20 మంది కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి మధ్యాహ్న భోజనం చేశారు. వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. సంతోష్ బాబు కుటుంబానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సిఎం హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments