తెలంగాణ మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షుపై తీన్మార్ మల్లన్న చేసిన బాడీషేమింగ్‌ను ఎమ్మెల్సీ కవిత ఖండించారు. విమర్శించటానికి ఎలాంటి కారణాలు లేనప్పుడు కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొంటారని ఆమె అన్నారు.
సోషల్ మీడియాలో చేసే పోస్టులు బాధ్యతతో చేయాలని, కానీ.. ద్వేషం, అబద్ధాలను వ్యాప్తి చేయటానికి కొంతమంది సోషల్ మీడియాను చాలా కాలంగా ఉపయోగిస్తుండటం సిగ్గు చేటని కవిత ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు.
కాగా ఇటీవల బీజేపీలో చేరిన తీర్మాన్ మల్లనకు చెందిన క్యూన్యూస్ మీడియా ట్విట్టర్‌లో నిర్వహించిన ఓ పోల్ తీవ్ర పరిణామాలకు బీజంగా మారింది. కేటీఆర్ తనయుడు హిమాన్షుపై బాడీ షేమింగ్ కామెంట్‌తో చేసిన ఆ పోల్ కారణంగా తీన్మార్ మల్లన్నపై టీఆర్ఎస్ పార్టీలో ఆగ్రహం పెల్లుబికింది.
ట్విట్టర్ వేదికగానే కేటీఆర్ తీన్మార్ మల్లన్న, బీజేపీపై నిప్పులు చెరిగారు. తాజాగా, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తీన్మార్ మల్లన్నపై దాడి చేశారు. ఇక తీన్మార్ మల్లన్నకు వ్యతిరేకంగా.. అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్ట్ లు వైరల్ గా మారుతున్నాయి. అయితే తనపై భౌతిక దాడులు జరిగినా భయపడేది లేదని.. తాను తప్పు చేయనప్పుడు వెనక్కు తగ్గేదేలే అంటున్నారు