Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బతుకమ్మ పాట `అల్లిపూల వెన్నెల`కు రెహమాన్ బాణీలు, వాసుదేవ మీనన్ ద‌ర్శ‌క‌త్వం

బతుకమ్మ పాట `అల్లిపూల వెన్నెల`కు రెహమాన్ బాణీలు, వాసుదేవ మీనన్ ద‌ర్శ‌క‌త్వం
, మంగళవారం, 5 అక్టోబరు 2021 (19:15 IST)
Gautam Vasudeva Menon, MLC Kavita
తెలంగాణ ఆడపడుచల పండుగ బతుకమ్మ మరోసారి విశ్వయవనికపై మెరవనుంది. ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ.ఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో బతుకమ్మ పాట "అల్లిపూల వెన్నెల" గా సరికొత్త సొబగులు అద్దుకుంది. బతుకమ్మ ఆట, పాటను తెలంగాణ ఆత్మగౌరవ పతాకంగా లోకానికి పరిచయం చేసిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పాటను నిర్మించారు. ప్రఖ్యాత దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వం వహించిన ఈ పూల సింగిడిని ఇవాళ దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ తో కలిసి ఎమ్మెల్సీ కవిత తన నివాసంలో విడుదల చేశారు. 
 
ఉత్తరా ఉన్నికృష్ణన్ పాడిన ఈ పాటకు ప్రముఖ రచయిత మిట్టపల్లి సరేందర్ లిరిక్స్ అందించగా,  జాతీయ అవార్డు గ్రహీత బ్రిందా కొరియోగ్రఫీ చేశారు. అక్టోబర్ 6 నుండి తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పండుగ విశ్వవ్యాప్తంగా ఘనంగా జరగనుంది. తెలంగాణ ఆడబిడ్డలు ఎంతో సంబురంగా జరుపుకునే ఈ పండుగకు "అల్లిపూల వెన్నెల"  మరింత శోభను తీసుకొస్తుంది. ఈ పాటను తెలంగాణలోని వివిధ లొకేషన్లలో ఎంతో అందంగా చిత్రీకరించారు. 

పాటను విడుదల చేసిన సందర్భంగా, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ట్విట్ చేశారు. “బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. జీవిత పండుగ. ఐక్యత యొక్క వేడుక. అందం యొక్క ఒక సంగ్రహావలోకనం బతుకమ్మ మీకు అందిస్తోంది. తెలంగాణ జాగృతితో పాటు "అల్లిపూల వెన్నెల" ద్వారా నా శుభాకాంక్ష‌లు` అని తెలిపారు.
 
ఇందుకు ప్ర‌తిగా క‌విత స్పందిస్తూ, "రంగులు, శ్రావ్యత మరియు సమైక్యత బతుకమ్మ పండుగ. బతుకమ్మ కోసం, నా సోదరీమణులందరి కోసం ప్రత్యేక పాట మీ సంగీతంతో ఆవిష్క‌రించ‌బ‌డింది` అంటూ  ట్వీట్ చేశారు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ వేడ‌క‌కూ న‌న్ను పిల‌వండి- సేవాదాస్ ఆడియోలో త‌ల‌సాని