Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ వేడ‌క‌కూ న‌న్ను పిల‌వండి- సేవాదాస్ ఆడియోలో త‌ల‌సాని

Advertiesment
Sevadas Audio
, మంగళవారం, 5 అక్టోబరు 2021 (18:38 IST)
Seva das audio function
శ్రీశ్రీ హథీరామ్ బాలాజీ క్రియేషన్స్ పతాకంపై కె.పి.ఎన్. చౌహాన్ దర్శకత్వంలో ఇస్లావత్ వినోద్ రైనా-సీతారామ్ నాయక్ నిర్మిస్తున్న బహుభాషా చిత్రం `సేవాదాస్`. సుమన్, భానుచందర్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రంలో కె.పి.ఎన్. చౌహాన్, ప్రీతి అస్రాని హీరో హీరోయిన్లు. కె.పి.ఎన్.చౌహాన్ దర్శకత్వంలో బంజారా-తెలుగు- ఇంగ్లీష్-హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రం ఆడియో వేడుక హైద్రాబాద్ ర‌వీంద్రభారతిలో అత్యంత కోలాహలంగా జరిగింది. భోలే షావలి ఈ చిత్రానికి సంగీత సారధ్యం వహించారు.
బంజారా సంప్రదాయపు డప్పులు, నృత్యాలు, వేషధారణలతో ఆద్యంతం ఆసక్తికరంగా నిర్వహించిన ఈ వేడుకలో తెలంగాణ మత్స్య-సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, గిరిజన, మహిళా సంక్షేమ శాఖామాత్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ త‌దిత‌రులు పాల్గొన్నారు. 
 
మంత్రి తలసాని మాట్లాడుతూ, "ఇది ఆడియో వేడుకలా లేదు. శత దినోత్సవ వేడుకలా ఉంది. "సేవాదాస్" చిత్రం కచ్చితంగా 100 రోజులాడాలి. ఆ వేడుకకు కూడా ముఖ్య అతిధిగా నన్ను పిలవాలి" అన్నారు.
మరో ముఖ్య అతిధి మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ "బంజారా బిడ్డలు బంజారా భాషలోనే కాకుండా తెలుగు-ఇంగ్లీష్-హిందీ భాషల్లో తీసిన "సేవాదాస్" ఆడియో ఫంక్షన్ లో పాల్గొనడం గర్వంగా ఉంది" అన్నారు.
 
ఈ చిత్రంలో సేవాదాస్ గా టైటిల్ రోల్ ప్లే చేసిన సుమన్, కీలకపాత్ర పోషించిన భానుచందర్, చిత్ర దర్శకుడు-కథానాయకుడు కె.పి.ఎన్.చౌహాన్, హీరోయిన్ ప్రీతి అస్రాని, గీతా సింగ్ "సేవాదాస్" చిత్రంలో నటించే అవకాశం లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
 
నిర్మాతలు ఇస్లావత్ వినోద్ రైనా, సీతారామ్ నాయక్ మాట్లాడుతూ, చిత్ర‌ రూపకల్పన కోసం శ్రమించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు. ఈనెల 15న ఇల్లందులో ప్రి-రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేసి, ఈనెలాఖరుకు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం" అన్నారు.
 
ఇంకా ఈ వేడుక‌లో మహబూబాబాద్ ఎమ్.పి శ్రీమతి మాలోత్ కవిత, ఇల్లందు ఎమ్మెల్యే శ్రీమతి హరిప్రియ బానోత్, ఖానాపూర్ ఎమ్.ఎల్.ఎ. శ్రీమతి రేఖా శ్యామ్ నాయక్, డోర్నకల్ ఎమ్.ఎల్.ఎ. రెడ్యా నాయక్, మహబూబాబాద్ ఎమ్.ఎల్.ఎ. శంకర్ నాయక్, వైరా ఎమ్.ఎల్.ఎ. ఎల్.రాములు నాయక్, దేవరకొండ ఎమ్.ఎల్.ఎ. రవీంద్ర నాయక్, బోద్ ఎమ్.ఎల్.ఎ. రాథోడ్ బాబూరావు, మహబూబాబాద్ మాజీ పార్లమెంటు సభ్యులు అజ్మీరా సీతారాం నాయక్ లతోపాటు తెలంగాణవ్యాప్తంగా గల పలువురు ఐ.ఎ.ఎస్, ఐ.పి.ఎస్, ఐ.ఆర్.ఎస్ అధికారులు పెద్ద సంఖ్యలో విశిష్ట అతిధులుగా పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మతి స్థిమితం లేని ప్రకాశ్ రాజ్- న‌రేశ్‌; పెద్దలకు గౌరవం ఇవ్వ‌నివ్య‌క్తి అవ‌స‌ర‌మాః మంచు విష్ణు