Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాజకీయాల్లో ఎంట్రీపై కేటీఆర్ కుమారుడి ట్వీట్‌.. వైరల్‌.. బొకేలు వద్దు మొక్కలు నాటండి..

Advertiesment
రాజకీయాల్లో ఎంట్రీపై కేటీఆర్ కుమారుడి ట్వీట్‌.. వైరల్‌.. బొకేలు వద్దు మొక్కలు నాటండి..
, బుధవారం, 7 జులై 2021 (12:01 IST)
Himanshu
సీఎం కేసీఆర్ మనవడు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు గురించి ప్రత్యేక చెప్పాల్సిన పనిలేదు. రాష్ట్ర ప్రజలందరికీ హిమాన్షు సుపరిచితుడే. హిమాన్షు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. 
 
ఎవరైనా తనను సాయం అడిగితే.. తనకు సాధ్యమైనంత వరకూ చేస్తూ మంచి మనసును చాటుకుంటున్నాడు. తాజాగా హిమాన్షు చేసిన ట్వీట్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం చాలా మంది దీని గురించే చర్చించుకుంటున్నారు.
 
తాత, తండ్రి వారసత్వాన్ని పుచ్చుకుని రాజకీయాల్లోకి హిమాన్షు రావడం ఖాయమని పలు రాజకీయ పార్టీ నేతలతో పాటు టీఆర్ఎస్ నేతలు బావిస్తున్నారు. తాజాగా హిమాన్షు తన రాజకీయ భవిష్యత్తు పై క్లారిటీ ఇచ్చాడు. 
 
తనకు రాజకీయాలపై ఆసక్తి లేదన్నారు. భవిష్యత్‌లో ఎప్పుడు కూడా రాజకీయాల్లోకి రానని స్పష్టంచేశారు. తనకంటూ ప్రత్యేక లక్ష్యాలు ఉన్నాయని, వాటిని చేరుకోవడమే తన ధ్యేయమని తెలిపాడు.
 
ఇక ఈనెల 12న 16వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు హిమాన్షు. తన బర్త్ డే సందర్భంగా ఎవరూ పూల బొకేలు పంపొద్దని.. దాని బదులు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని మరో ట్వీట్‌లో కోరారు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

న‌ల్ల‌టి దుస్తుల్లో జ‌న‌సేనాని, కోవిడ్ బాధితులకు కోటి రూపాయల విరాళం