Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుళ్లినస్థితిలో జూనియర్ ఆర్టిస్ట్ మృతదేహం.. ఆరా తీస్తే...

Webdunia
గురువారం, 30 సెప్టెంబరు 2021 (08:11 IST)
హైదరాబాద్ నగరంలోని జూబ్లీ హిల్స్‌లో ఓ జూనియర్ ఆర్టిస్ట్ మృతదేహం కుళ్లిన స్థితిలో కనిపించింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత దీనిపై ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రేమించిన వ్యక్తితో కలిసి సహజీవనం చేస్తూ వచ్చిన ఈ జూనియర్ ఆర్టిస్ట్.. అతడు చేసిన మోసాన్ని భరించలేక ప్రాణాలు తీసుకున్నట్టు తేలింది. ఈ ఘటనపై బాధితురాలి సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 
బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. కుత్బుల్లాపూర్ సమీపంలోని గాజులరామారానికి చెందిన కావలి అనురాధ (22) సినిమాలలో జూనియర్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తోంది. కిరణ్ అనే యువకుడిని ఆరేళ్లుగా ప్రేమిస్తూ వస్తోంది. అతడు పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో మూడు నెలల నుంచి ఫిలింనగర్‌లోని జ్ఞానిజైల్‌సింగ్ నగర్‌లోని ఓ ఇంట్లో అతడితో కలిసి సహజీవనం చేస్తోంది.
 
ఈ క్రమంలో ఆమె ఉంటున్న ఇంటి నుంచి దుర్వాసన వస్తుండడంతో అదే అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న కొందరు యువకులు విషయాన్ని ఇంటి యజమాని దృష్టికి తీసుకెళ్లారు. ఆయన పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలుగొట్టి లోపలికి వెళ్లారు. లోపల ఓ గదిలో అనురాధ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని కనిపించింది.
 
కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనురాధను పెళ్లాడతానని నమ్మించి ఆమెకు తెలియకుండా మరో యువతితో కిరణ్ నిశ్చితార్థం చేసుకున్నాడని, ఈ మోసాన్ని భరించలేకే ఆమె ఆత్మహత్య చేసుకుందని బాధిత యువతి సోదరి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

రమణారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన పద్మశ్రీ, డాక్టర్ బ్రహ్మానందం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

తర్వాతి కథనం
Show comments