Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లవ్ స్టోరి నాంది పలికింది - మూడు రోజులు అదే మూడ్‌లో వున్నాః నాగార్జున‌

Advertiesment
లవ్ స్టోరి నాంది పలికింది - మూడు రోజులు అదే మూడ్‌లో వున్నాః నాగార్జున‌
, మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (20:49 IST)
Nagarjuna
`లవ్ స్టోరి ఫస్ట్ డే వరల్డ్ వైడ్ షేర్ 7 కోట్లు. ఒక మంచి సినిమా ఇస్తే థియేటర్లకు వస్తామని తెలుగు ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. కొవిడ్ ఒక్కటే కాదు తుఫాన్, సైక్లోన్ వచ్చినప్పుడు కూడా మన వాళ్లు సినిమాలను ఆదరించారు. లవ్ స్టోరి ఒక నాంది. దసరా సంక్రాంతికి సినిమాలు రిలీజ్ చేసుకునేందుకు ధైర్యం వచ్చింది. ప్రతి ఫిల్మ్ మేకర్ లవ్ స్టోరి విజయం వల్ల సంబరాలు చేసుకున్నారని` హీరో నాగార్జున తెలిపారు.
 
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా `లవ్ స్టోరి` విడుదలైన ప్రతి సెంటర్ నుంచి సూపర్బ్ రిపోర్ట్ అందుకుంటోంది. ఈ నేపథ్యంలో మ్యాజికల్ సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించింది లవ్ స్టోరి టీమ్. ఈ కార్యక్రమంలో చిత్ర బృందంతో పాటు నాగార్జున, డి సురేష్ బాబు తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడారు.  ఇది హ్యూమానిటీ సక్సెస్ మీట్ లా అనిపిస్తోంది. మార్చి 2020 నుంచి పోరాడుతూనే ఉన్నా వైరస్ తో , ఏడాదిన్నర గడిచిపోయింది. ఒక వేవ్ లో బయటపడ్డాం అనుకున్నాం కానీ రెండో వేవ్ వచ్చి అణిచివేసింది. ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం. 208 రోజుల తర్వాత తెలంగాణలో కోవిడ్ డెత్స్ లేవని తెలిసి సంతోషించాను. ఏపీతో పాటు దేశంలోనూ కరోనా తగ్గుతోంది. కాబట్టి మనం దాన్ని ముందు సెలబ్రేట్ చేసుకోవాలి. కేంద్ర, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కరోనా తో బాగా పోరాడారు. కరోనాతో పోరాడి, కరెక్ట్ డెసిషన్స్ సరైన సమయంలో తీసుకుని ప్రజల్ని కాపాడారు. తెలంగాణ మీద కాస్త కనికరం చూపించింది, ఏపీలో ఉధృతి ఎక్కువగా ఉండేది. కానీ ఇవాళ ఆ వైరస్ నుంచి బయటపడ్డాం. ప్రజల్ని కాపాడటమే ప్రభుత్వాల పని. చాలా రాష్ట్రాల్లో థియేటర్స్ తెరవలేదు. తెలంగాణలో థియేటర్స్ తెరిచారు. ఏపీలో వైరస్ దృష్ట్యా పూర్తిగా తెరవలేదు. ఆరోగ్య కార్యకర్తల నుంచి ముఖ్యమంత్రుల దాకా థాంక్స్ చెబుతున్నా. లవ్ స్టోరి సక్సెస్ గురించి మాట్లాడాలంటే ఎక్కడి నుంచి మొదలుపెట్టాలో తెలియడం లేదు. ఈ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమకే కాదు మొత్తం దేశ సినిమా పరిశ్రమకే ఉత్సాహాన్ని ఇస్తోంది.
 
దర్శకుడు శేఖర్ కమ్ముల నుంచి మనం సంస్కారం నేర్చుకోవాలి. ఆయన పేరు పేరునా టీమ్ అందరినీ పిలిచారు. మేము మర్చిపోతాం. నీ మానవత్వం సూపర్బ్. శేఖర్ కమ్ముల చాలా సెన్సిటివ్ డైరెక్టర్. ఆయన థీమ్స్ అన్నింటిలో సెన్సిటివిటీ ఉంటుంది. కానీ అది సరిపోదు. దాన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో బ్యాలెన్స్ చేసి తీయాలి. శేకర్ కమ్ముల అది నేర్చుకున్నాడు. లవ్ స్టోరి ఊరికే హిట్ అవలేదు. అన్ని ఎలిమెంట్స్ కలిపి తెరకెక్కించారు. వన్ గర్ల్ ముందుకొచ్చి తన సమస్యను చెప్పగలిగితే చాలు లవ్ స్టోరి కి సార్థకత వచ్చినట్లే. సినిమాలో ప్రతి సన్నివేశం బ్యూటిఫుల్ గా ఉంది. ఏదో ఏవేవో వద్దు ఒక టెర్రస్ చాలు మంచి సినిమా చేసేందుకు అని నిరూపించారు శేఖర్ కమ్ముల. క్యారెక్టర్స్ తో ఎమోషన్ కనెక్ట్ చేస్తే చాలు సినిమా విజయం సాధిస్తుందని శేఖర్ కమ్ముల ప్రూవ్ చేశారు. 
 
నాకు ఇలాంటి ఇన్సిడెంట్స్ చదవడం కూడా ఇష్టం ఉండదు. కానీ అలాంటి అంశాలను శేఖర్ కమ్ముల చూపించిన విధానం సూపర్బ్. నేను సినిమా చూసి రెండు మూడు రోజులు అదే ఎమోషన్ లో ఉండిపోయాను. నారాయణ దాస్ నారంగ్ గారికి నాన్నగారు ఏఎన్నార్ తో చాలా అనుబంధం ఉండేది. పవన్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఏఆర్ రెహమాన్ గారి శిష్యుడు అని విన్నాను. అందుకే వందలాది మిలియన్ వ్యూస్ వచ్చాయి. వెల్ డన్ పవన్. సుద్దాల సాహిత్యం, మంగ్లీ పాటలు పాడిన తీరు బ్యూటిఫుల్ గా ఉంది. సినిమాకు పనిచేసిన చాలా మంది గురించి మాట్లాడాలి. సాయి పల్లవి వండర్ ఫుల్ యాక్ట్రెస్. ఆమె డాన్స్ చేస్తుంటే సమ్ స్పిరిట్ కనిపిస్తుంటుంది. ఆమె చుట్టూ వంద సాయి పల్లవిలు డాన్స్ చేస్తున్నట్లు ఉంటుంది. ఆమె కాళ్లు గాలిలో తేలినట్లు ఉంటాయి. నువ్వు ఏ క్యారెక్టర్ చేసినా ఆ మ్యాజిక్ కనిపిస్తుంటుంది. నీకు అది గొప్ప గిఫ్ట్. 
 
చైతన్యను చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. ఈ సినిమా చూశాక ఇంకా సంతోషమేసింది. యాక్టర్ అండ్ స్టార్ ఇవి రెండు డిఫరెంట్ పదాలు. చైతూను ఒక స్టార్ యాక్టర్ గా తయారు చేశావ్ శేఖర్ కమ్ముల. అతన్ని న్యూ జర్నీలో తీసుకెళ్లావ్. నాన్నా...నువ్వు చాలా ఫెంటాస్టిక్ గా నటించావు. నేను నవ్వేలా, ఏడ్చేలా చేశావ్ సినిమాలో. ప్రేమనగర్ రిలీజ్ అయి 50 ఏళ్లవుతోంది. సేమ్ డేట్ కు లవ్ స్టోరి రిలీజ్ అయ్యింది. ప్రేమనగర్ టైమ్ లోనూ తుఫాన్ సైక్లోన్ అన్నీ ఉన్నా, నాన్నగారి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. తుఫాన్, కొవిడ్, సైక్లోన్ తో పోరాడి లవ్ స్టోరి గొప్ప విజయాన్ని సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎప్పుడూ మమ్మల్ని మంచి చూపుతో చూశాయి. తెలుగు  ప్రేక్షకులు సినిమాను ప్రేమిస్తారు. ఇకపైనా ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మనం మాస్క్ లు తీసేసి హాయిగా కలిసి ఉండాలని, ఆ రోజు రావాలని కోరుకుంటున్నా. అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్ర‌తి మ‌హిళ అలా చేస్తేనే నిజ‌మైన స‌క్సెస్ అయిన‌ట్లుః సాయిప‌ల్ల‌వి కామెంట్‌