Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ చేయనన్న వైష్ణవ్ తేజ్, కానీ...

Advertiesment
Vaishnav Tej
, మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (19:19 IST)
సాధారణంగా శేఖర్ కమ్ములతో సినిమా అంటే ఏ హీరో అయినా హీరోయిన్ అయినా ఎగిరి గంతేస్తారు. వెంటనే సినిమాను ఒప్పేసుకుంటారు. శేఖర్ కమ్ముల సినిమా అంటే ఆ విధంగా ఉంటుంది. వైవిధ్యభరితమైన కథతో ఎంతో ఆసక్తిని రేకెత్తించే విధంగా సినిమాలను తీస్తుంటాడు శేఖర్ కమ్ముల.
 
శేఖర్ కమ్ముల సినిమాలంటే ఒక బ్రాండ్. తక్కువ బడ్జెట్‌తో మంచి హిట్‌ను ఇవ్వగలడు. అలాంటి డైరెక్టర్ ఆఫర్ ఇస్తే వద్దన్నాడట హీరో వైష్ణవ్. ఉప్పెన సినిమాతో వైష్ణవ్‌కు మంచి పేరే వచ్చింది. భారీ హిట్ టాక్‌ను సొంతం చేసుకోవడమే కాదు యువ హీరో వైష్ణవ్‌ను యువ అగ్రహీరోల స్థాయికి చేర్చింది. 
 
అయితే ప్రస్తుతం విడుదలై హిట్ టాక్‌తో మంచి కలెక్షన్లతో ముందుకు వెళుతున్న లవ్ స్టోరీ సినిమాకు మొదట హీరోగా  ఎంపిక చేసింది ఉప్పెన హీరో వైష్ణవ్ తేజ్‌నేనట. ఉప్పెనలో అతని నటన శేఖర్ కమ్ములకు బాగా నచ్చిందట. దీంతో వైష్ణవ్ తేజ్‌ను మొదటగా ఎన్నుకుని అడిగారట.
 
ఉప్పెన సినిమాలో కులాంతర ప్రేమ కథ ఉండడం.. ఆ సినిమా కథలాగే లవ్ స్టోరీ కూడా ఉండటంతో ఏమాత్రం ఆలోచించకుండా వద్దని చెప్పేశాడట వైష్ణవ్. ఆ తరువాత నాగచైతన్యను ఎంపిక చేసుకుని సినిమాను పూర్తి చేసి విడుదల చేశారు.
 
ఇప్పుడీ సినిమా మంచి హిట్ టాక్‌తో ముందుకు సాగుతుండడంతో వైష్ణవ్ ఈమధ్య దీనిపై పెదవి విప్పాడట. ఈ సినిమా ఈ స్థాయిలో హిట్ అవుతుందని నేను కూడా ఊహించలేదు. మొదట్లో కథను చెప్పినప్పుడు వద్దని చెప్పేశాను. కానీ ఇప్పుడు ఇలా.. అంటూ ఆపేశాడట వైష్ణవ్ తేజ్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

90 మిలియ‌న్ వ్యూస్ సాధించిన ఆచార్య సాంగ్‌