Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలుగు ఖ్యాతిని పెంపొందించిన పైడి జయ రాజ్ : మంత్రి శ్రీనివాస్ గౌడ్

తెలుగు ఖ్యాతిని పెంపొందించిన పైడి జయ రాజ్ :  మంత్రి శ్రీనివాస్ గౌడ్
, మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (18:34 IST)
Minister Srinivas Gowd at chamber
తెలంగాణ ప్రాంతం నుండి మూకీల సమయంలోనే హీరోగా బాలీవుడ్ లో నిలదొక్కుకున్న నటుడు  పైడి జయ రాజ్. సెప్టెంబర్ 28న ఆయ‌న 112వ జ‌యంతి. మంగళవారం ఫిలిం ఛాంబర్ లో ప్రముఖ నటుడు జైహింద్ గౌడ్ ఆధ్వర్యంలో వేడుక‌లు జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ పైడి జయ రాజ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. 
 
అనంతరం మంత్రి మాట్లాడుతూ, అప్పట్లో అందరూ సినిమాల్లో రాణించాలని మద్రాసు వెళితే మన జైరాజ్ మాత్రం ముంబై రైలు ఎక్కి ముంబై చేరుకొని అక్కడ సినిమాల్లో ప్రయత్నాలు సాగించారు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి హీరోగా ఎదిగి ఆ తరువాత దేశంలోనే ప్రతిష్టాత్మకంగా ఇచ్చే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోవడం తెలంగాణ వారీగా,  తెలుగు వారీగా ఇది మనకు నిజంగా గర్వకారణం. అయన జీవితం నేటితరాలకు స్ఫూర్తి. రియల్ హీరోగా ఎదిగిన అయన మనందరికీ ఆదర్శం. అయన జ్ఞాపకార్థముగా రవీంద్ర భారతిలో పైడి జైరాజ్ హల్ ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక జైహింద్ గౌడ్ కోరినట్టు ఫిలిం నగర్ ప్రాంతంలో ఛాంబర్ పరిధిలో అయన విగ్రహం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. నిజానికి అది ఎప్పుడో ఏర్పాటు చేయాల్సింది. కానీ చేయలేదు. ఇప్పటికైనా ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేయాలి. ఈ వేడుకలను నిర్వహిస్తున్న జైహింద్ గౌడ్ అండ్ వాళ్ళ టీం ని అభినందిస్తున్నాను అన్నారు.
 
నటుడు జైహింద్ గౌడ్ మాట్లాడుతూ, నేను 2010 నుండి అయన జయంతి వేడుకలు నిర్వహిస్తున్నాను. కనీసం అయన ఫోటో ఛాంబర్ లో పెట్టడానికి కూడా మొదట్లో ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు జైరాజ్ గురించి తెలిసి అందరు సహకారం అందిస్తున్నారు. జైరాజ్ అప్పట్లోనే అంటే మూకీల సమయంలోనే హీరోగా ఎదిగిన వ్యక్తి. అయన జీవితం మనందరికీ ఆదర్శం. అలాంటి మహనీయుడిని మనం మరచిపోకూడదు . అయన జయంతి వేడుకలు ఇంకా గ్రాండ్ గా నిర్వహించాల్సిన అవసరం ఉందని అన్నారు.
 
ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో `దెయ్యాలున్నాయా` చిత్ర ద‌ర్శ‌కుడు కంకనాల శ్రీనివాస్ రెడ్డి, హీరోయిన్ ప్రియాంక తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొని వారి సందేశాలు అందచేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అలీని త‌న కాళ్ళ‌మీద ప‌డేలా చేసిన మోహ‌న్‌బాబు