Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు - నాలుగు రోజుల పాటు వర్షాలు

Webdunia
గురువారం, 30 మార్చి 2023 (15:32 IST)
రెండు తెలుగు రాష్ట్రాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోయింది. అదేసమయంలో మరికొన్న ప్రాంతాల్లో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇంకొన్ని ప్రాంతాల్లో చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 
 
ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గురువారం నుంచి ఆదివారం వరకు పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. గురు, శుక్రవారాల్లో మూడు, నాలుగు జిల్లాల్లో, శని, ఆదివారాల్లో మాత్రం రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వర్ష ప్రభావం ఉంటుందని తెలిపింది. 
 
అదేసమయంలో ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. బుధవారం నిజామాబాద్, నిర్మల్, నాగర్ కర్నూలు, ఆదిలాబాద్ జిల్లాల్లో 40 డిగ్రీల పైచిలుకు ఉష్ణోగ్రతలు ననమోదయ్యాయి. 
 
నిజామాబాద్‌లోని జక్రాన్‌పల్లిలో ఆత్యధికంగా 41.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే రెండు మూడు రోజుల్లో మరిన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత 40 డిగ్రీలు దాటే అవకాశం ఉందని పేర్కొంది. అందువల్ల ప్రజలు ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు పగటిపూట ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, ఇతరులు కూడా అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచన చేసింది.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments