Publish Date: Thu, 30 Mar 2023 (14:16 IST)
Updated Date: Thu, 30 Mar 2023 (14:29 IST)
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాయిదా పడిన ఏఈఈ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. మే 8, 9, 21 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. మే 8న ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ పరీక్ష నిర్వహిస్తారు.
మే 9న అగ్రికల్చర్ ఇంజనీరింగ్ పరీక్ష జరుగుతుంది. సివిల్ ఇంజినీరింగ్ పరీక్ష మే 21న జరుగుతుంది.
ఈసారి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్‌ను నిర్వహించాలని టీఎస్‌పీఎస్పీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల కోసం పకడ్బందీ చర్యలు చేపట్టనున్నారు. ఈ ఎగ్జామ్స్‌కు ఉద్యోగులకు సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌ని కానీ అనుమతించరు.