Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్లీజ్ ఒక్కసారి కోర్కె తీర్చు, నిన్ను వేధించడం మానేస్తా: స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్

Webdunia
గురువారం, 20 ఆగస్టు 2020 (15:26 IST)
సాయం చేస్తానంటూ పరిచయం పెంచుకున్న ఓ ఇన్‌స్పెక్టర్ మహిళను లైంగిక వేధింపులకు గురి చేసి సస్పెన్షన్ వేటుకు గురయ్యాడు. అతడు చేసిన లైంగిక వేధింపులు తారాస్థాయికి చేరాయి. తనతో వీడియో కాల్‌లో నగ్నంగా మాట్లాడాలని, అలా చేయకపోతే యాసిడ్ దాడి చేస్తానంటూ బెదిరింపులకు కూడా పాల్పడ్డాడు. 
 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. గతంలో వరంగల్ లో ఫుడ్ ఇన్‌స్పెక్టర్ గా పనిచేస్తున్న మహిళ వనస్థలిపురంలో పనిచేస్తున్నారు. కాగా కొన్ని రోజుల క్రితం తన పదో తరగతి సర్టిఫికేట్లు మిస్ కావడంతో మిర్యాలగూడ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో అక్కడే వున్న ఇన్‌స్పెక్టర్ చంద్రకుమార్ ఆమెకు పరిచయమయ్యారు. ఆ సర్టిఫికెట్లు రికవరీ చేసి ఇచ్చిన చంద్రకుమార్, ఇక అప్పట్నుంచి ఆమెకి తరచూ ఫోన్ చేయడం మొదలుపెట్టాడు.
 
ఇటీవలే బదిలీపై యాచారం ఇన్‌స్పెక్టర్‌గా వచ్చిన చంద్రకుమార్ బాధిత మహిళకు తరచూ ఫోన్లు చేసి ఒకే ఒక్కసారి తన కోర్కె తీర్చాలనీ, ఆ తర్వాత ఇక వేధించనని చెప్పాడు. దీంతో ఆమె ఈ విషయాన్ని రాచకొండ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేయగా అతడిని అధికారులు పిలిపించి మందలించారు. బుద్ధి మార్చుకుని పనిచేసుకోమని హెచ్చరించారు. ఐతే ఇన్‌స్పెక్టర్ మాత్రం తన వైఖరి మార్చుకోలేదు.
 
 తాజాగా మహిళ ఇంటికి వెళ్లి తన కోర్కె తీర్చకపోతే యాసిడ్ దాడి చేసి అఘాయిత్యం చేస్తానంటూ బెదిరించాడు. దీనితో బాధితురాలు హైదరాబాద్ పోలీసు కమిషనర్ కి ఫిర్యాదు చేయడంతో అతడిపై సస్పెన్షన్ వేటు వేశారు. నిర్భయ కేసు నమోదు చేశారు. ఐతే ఇప్పటివరకూ అతడిని అరెస్టు చేయలేదంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. తక్షణమే అతడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం