Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిస్టర్ ప్రధాని మోడీజీ... మీరు ఆ పని చేస్తే లీటరు పెట్రోల్ రూ.70కే: మంత్రి కేటీఆర్

Webdunia
గురువారం, 28 ఏప్రియల్ 2022 (10:09 IST)
దేశంలో పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోవడానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వాలేనంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ఆరోపణలపై తెలంగాణ మంత్రి, తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పెట్రోల్ ధరలతో పాటు ఇతర నిత్యావసర ధరల పెరుగుదల అంశంపై రాష్ట్ర ప్రభుత్వాలపై నిందలు మోపడాన్ని మానుకోవాలని హితవు పలికాలు. అంతేకాకుండా, చమురు ధరలను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే లీటర్ పెట్రోల్, డీజల్‌లు రూ.70కే లభిస్తాయని తెలిపారు. 
 
బుధవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ నిర్వహించిన వర్చువల్ సమావేశంలో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గకపోవడానికి రాష్ట్రాలే కారణమంటూ వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ను తగ్గిస్తేనే పెట్రోల్ ధరలు తగ్గుతాయన్నారు. తెలంగాణ, ఏపీ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ తగ్గించడం లేదని ఆయన విమర్శించారు.
 
ఈ వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఇలా ప్రత్యేకంగా ఒక రాష్ట్రం పేరును ఎలా చెపుతారని ఆయన ప్రశ్నించారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం వల్లే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయని అన్నారు. తాము వ్యాట్‌ను పెంచకపోయినప్పటికీ రాష్ట్రం పేరును లేవనెత్తడమే మీరు మాట్లాడే కోఆపరేటివ్ ఫెడరలిజమా? అని ప్రశ్నించారు. 
 
2014 నుంచి తెలంగాణలో పెట్రోల్, డీజిల్ పై వ్యాట్‌ను పెంచలేదని చెప్పారు. మీరు వసూలు చేస్తున్న సెస్‌లో చట్టబద్ధంగా తమకు రావాల్సిన 41 శాతం వాటా రావడం లేదని కేటీఆర్ విమర్శించారు. సెస్ పేరుతో మీరు రాష్ట్రం నుంచి 11.4 శాతం వాటాను లూటీ చేస్తున్నారంటూ మండిపడ్డారు. సెస్‌ను రద్దు చేస్తే దేశ వ్యాప్తంగా లీటర్ పెట్రోల్ ధర రూ.70కి, డీజిల్ ధర రూ.60కి వస్తుందని మంత్రి కేటీఆర్ వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagarjuna: పూరీ జగన్నాథ్, నాగార్జున చిత్రం షురు - తాజా న్యూస్

Priyanka: ప్రియాంక చోప్రా ను ఒంటరిగా రమ్మన్నాడు : ప్రియాంక తల్లి ఆరోపణ

Ketika Sharma: నితిన్.. రాబిన్‌హుడ్‌లో కేతిక శర్మను ప్రజెంట్ చేస్తూ స్పెషల్ సాంగ్

పొయెటిక్ మూవీ కాలమేగా కరిగింది విడుదల కాబోతుంది

శ్రీకాంత్ ఓదెల కథతో Al అమీనా జరియా రుక్సానా- గులాబీ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

వైజాగ్‌ను ప్రకాశవంతంగా మార్చిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి

ICE Apples: వేసవి కాలం తాటి ముంజలు.. మహిళల్లో ఆ సమస్యలుండవ్.. ఏంటవి?

Summer: వేసవిలో పిల్లలను రక్షించడం ఎలా..? మసాలా ఫుడ్, ఫ్రిజ్ నీరు వద్దు..

తర్వాతి కథనం
Show comments