Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆన్‌లైన్ లోన్ యాప్‌.. టెక్కీ ఆత్మహత్య... రూ.70వేలు అప్పు తీసుకుని..?

Hyderabad
Webdunia
శుక్రవారం, 18 డిశెంబరు 2020 (13:21 IST)
ఆన్‌లైన్ లోన్ యాప్‌ల్లో లోన్ తీసుకున్న ఓ టెక్కీ ప్రాణాలు కోల్పోయాడు. ఆన్‌లైన్ లోన్లతో ప్రాణాలు తీసుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ఆన్‌లైన్ అప్పులు, వేధింపులతో చనిపోయే వారు పెరుగుతున్నారు. తాజాగా.. హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. 
 
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ కిస్మాత్‌పూర్‌లో ఉండే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సునీల్.. ఇన్‌స్టంట్ లోన్‌లో రూ.70 వేలు అప్పు తీసుకున్నాడు. ఆ అప్పు తీర్చాలంటూ తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చారు లోన్ యాప్ ప్రతినిధులు. దీంతో.. ఒక బాకీ తీర్చేందుకు మరో యాప్‌లో లోన్ తీసుకున్నాడు సునీల్.. ఇలా అప్పులు చేస్తూ చేస్తూ అప్పుల ఊబిలోకి వెళ్లిపోయాడు.
 
ఇక, రూ.70 వేల అప్పు కట్టకపోవడంతో సునీల్ తల్లికి ఫోన్ చేసి మరి బెదిరించింది లోన్ యాప్‌ టీమ్. దీంతో.. తీవ్ర మనస్తాపం చెందిన సునీల్‌.. కిస్మాత్‌పూర్‌లోని తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆన్‌లైన్ లోన్‌ యాప్ ప్రతినిధుల వేధింపుల కారణంగానే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు మృతుడి భార్య.. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments