బాబోయ్ ఎండలే ఎండలు.. బోరబండలో అత్యధికంగా 40.2 డిగ్రీలు

Webdunia
బుధవారం, 5 ఏప్రియల్ 2023 (12:11 IST)
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా తెలంగాణాలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. పగటిపూట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా విపరీతంగా పెరిగిపోయాయి. బోరబండలో అత్యధికంగా 40.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉక్కపోతను అధికమించేందుకు ప్రజలు నానాతంటాలు పడుతున్నారు. మరోవైపు, విద్యుత్ వినియోగం కూడా గణనీయంగా పెరిగిపోయింది. 
 
హైదరాబాద్ వాతావరణం కేంద్రం వెల్లడించిన వివరాల మేరకు మంగళవారం హైదరాబాద్ నగరంలోని బోరబండలో అత్యధికంగా 40.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే, ఖైరతాబాద్‌లో 40.1 డిగ్రీలు, శేరిలింగంపల్లిలో 39.9 డిగ్రీలు, షేక్‍పేటలో 38.9 డిగ్రీలు, మియాపూర్‌లో 38.7, సరూర్ నగర్‌లో 38.1, కాప్రాలో 38 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదేవిధంగా రాత్రిపూట కూడా ఈ ఉష్ణోగ్రతలు అధికంగానే నమోదవుతున్నాయి. మంగళవారం రాత్రి ఏకంగా 25 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత నమోదైంది.
 
అయితే, బుధవారం మాత్రం హైదరాబాద్ నగరంపై ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, సాంయంత్రం, రాత్రి వేళల్లో తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఎండలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో విద్యుత్ వినియోగం కూడా పెరిగింది. ఈ నెల 3వ తేదీన గరిష్టంగా 69.10 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం పెరిగిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments