Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో వర్ష బీభత్సం.. జంట జలాశయాల గేట్ల ఎత్తివేత

Webdunia
శుక్రవారం, 9 సెప్టెంబరు 2022 (09:12 IST)
గత కొన్ని రోజులుగా వరుణ దేవుడు హైదరాబాద్ నగరంపై పగబట్టినట్టు కనిపిస్తున్నారు. ఫలితంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో హైదరాబాద్ నగరం తడిసి ముద్దై పోతోంది. అనేక లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోతున్నాయి. ఈ వర్షాల దెబ్బకు భాగ్యనగరి వాసులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ఎడతెరిపి లేకుుండా కురుస్తున్న వర్షాల వల్ల పలు జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి. 
 
దీంతో జంట జలాశయాల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ జంట జలాశయాల గేట్లను పూర్తిగా ఎత్తివేశారు. ఈ కారణంగా మూసీ నదీ పరివాహక ప్రాంతల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు హెచ్చరించారు. వర్ష బాధితుల కోసం హెల్ప్‌లైన్ నంబర్లను కూడా ప్రకటించారు. 
 
మరోవైపు, నగర శివారులోని జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లకు వరద నీరు పోటెత్తింది. ఈ జంట జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో నీటి మట్టాలు ప్రమాదకరస్థాయికి చేరుకున్నాయి. దీంతో వీటి గేట్లను ఎత్తివేసి మూసీ నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ కారణంగా మూసీ నది పరివాహక ప్రాంతాలకు చెందిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఘటికాచలం: నిర్మాత ఎస్ కేఎన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments