Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్థరాత్రి డ్రంకన్ డ్రైవ్‌లో పోలీసుల‌కు చుక్క‌లు చూపించిన యువ‌తి..!

వీకెండ్ వ‌చ్చిందంటే చాలు... యూత్ బార్‌ల వైపు బారులు తీస్తున్నారు. ఇంకేముంది ప‌బ్‌లో.. మందేసి చిందేయ‌డం... అర్థరాత్రి డ్రంక్ & డ్రైవ్ త‌నిఖీలో దొరక‌డం.. పోలీసుల‌కు చుక్క‌లు చూపించ‌డం... మామూలైపోయింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ప

Webdunia
శనివారం, 12 మే 2018 (14:22 IST)
వీకెండ్ వ‌చ్చిందంటే చాలు... యూత్ బార్‌ల వైపు బారులు తీస్తున్నారు. ఇంకేముంది ప‌బ్‌లో.. మందేసి చిందేయ‌డం... అర్థరాత్రి డ్రంక్ & డ్రైవ్ త‌నిఖీలో దొరక‌డం.. పోలీసుల‌కు చుక్క‌లు చూపించ‌డం... మామూలైపోయింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేయ‌గా... తప్పతాగిన మైకంలో కార్లు నడుపుతూ ఇద్దరు యువతులు పోలీసుల‌కు చిక్కారు. 
 
మద్యం తాగిన మత్తులో ఉన్న ఆ ఇద్ద‌రు యువ‌త‌లు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. మహిళా కానిస్టేబుల్ లేకుంటే సహకరించేది లేదని నీషు అగ‌ర్వాల్ అనే యువ‌తి మొండికేసింది. చివరికి మహిళా కానిస్టేబుల్‌ని రప్పించి తనిఖీ చేసారు. బ్రీత్ ఎనలైజర్ పరీక్ష నిర్వహించగా.. మద్యం మోతాదు 86 పాయింట్లుగా నమోదైంది. దీంతో నీషు అగర్వాల్ పైన కేసు బుక్ చేసి.. ఆమె కారును సీజ్ చేశారు. 
 
తాగిన మత్తులో కారు నడుపుతూ చిక్కిన మరో యువతి విద్యార్థిని లహరికు బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్షంచగా.. 47 పాయింట్ల మద్యం మోతాదుగా నమోదైంది. దాంతో లహరి పైన కేసు బుక్ చేసి.. ఆమె కారును సీజ్ చేశారు. ట్రాఫిక్ పోలీసులు డ్రంకన్ డ్రైవ్‌లో 96 కేసులు చేసి 39 కార్లు, 57 బైకుల్ని సీజ్ చేసారు. డ్రంకన్ డ్రైవ్‌లో చిక్కిన వారందర్నీ బేగంపేట్‌లో కౌన్సిలింగ్ నిర్వహించాక.. కోర్టులో హాజరు పరుస్తామని పోలీసులు మీడియాకి తెలియ‌చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments