తీవ్ర ఆందోళనలో హైదరాబాద్ ప్రజలు.. కేటీఆర్

Webdunia
మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (09:10 IST)
డెంగ్యూ వ్యాధి పట్ల హైదరాబాద్ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సీజనల్ వ్యాధులు నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, వాటి అమలకు సంబంధించి ఆదేశాలు జారీ చేయాలని అధికారులను ఆదేశించినట్లు కేటీఆర్ తెలిపారు. 
 
జీహెచ్ఎంసీలో సీజనల్ వ్యాధులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అధికారులు ప్రయత్నించాలని ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో ఆరు జోన్లకు సంబంధించి అధికారులు అంతా ఉదయాన్నే గ్రామాల్లో పర్యటించాలని కేటీఆర్ ఆదేశించారు. 
 
మంగళవారం నుంచి వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తో  కలిసి తాను హైదరాబాద్ లో పర్యటించనున్నట్లు తెలిపారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇండ్లలో నీరు నిలువ లేకుండా చూడాలని కోరారు. మెడికల్ క్యాంపులు సైతం నిర్వహించనున్నట్లు తెలిపారు. 
 
ఈనెల 15, 16లోపు నగరంలో ఉన్న చెత్తను పూర్తిగా తొలగించాలని అధికారులను ఆదేశించినట్లు కేటీఆర్ తెలిపారు. 25 మెడికల్ క్యాంపులను నిర్వహించనున్నట్లు కేటీఆర్ తెలిపారు. బస్తీ దవాఖానాల్లో సాయంత్రమే ఓపీ అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: యుద్దం నేపథ్యంలో శంబాల ట్రైలర్‌.. ఆవిష్కరించిన ప్రభాస్

Allari Naresh: ప్రేమ, థ్రిల్ ఎలిమెంట్స్ తో అల్లరి నరేష్ 12A రైల్వే కాలనీ

Bhagyashree Borse: నక్షత్రాల మధ్య ఆటలాడుతూ, వెన్నెల్లో తేలియాడుతూ.. రామ్, భాగ్యశ్రీ బోర్సే

Mass Jatara Review: జరుగుతున్న కథతో ఫ్యాన్స్ ఫార్ములాగా మాస్ జాతర - మూవీ రివ్యూ

Allu Sirish and Nayanika: నయనిక రెడ్డితో అల్లు శిరీష్.. తారల సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments