మేనకోడలితో పెళ్లి.. ఎఫ్‌బీ పరిచయంతో ఆరుగురితో పెళ్లి.. నిత్యం పెళ్లేనా?

Webdunia
శనివారం, 5 డిశెంబరు 2020 (16:23 IST)
ఫేస్‌బుక్ పరిచయంతో అతడు ఆరుమందిని వివాహం చేసుకున్నాడు. ప్రేమ పేరుతో యువతుల్ని మోసం చేస్తున్న అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేటుగాడి లీలలు హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చాయి. ప్రేమ పెళ్లి అంటూ పరిచయం పెంచుకుని.. వారిని లొంగదీసుకుని ఆపై డబ్బులు గుంజేస్తున్న అతడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే... హైదరాబాద్‌ చందానగర్ ఆర్టీసీ కాలనీకి చెందిన విజయభాస్కర్‌ లీలలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి.
 
ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన కుర్ర విజయభాస్కర్‌ 2017 మేనకోడలును వివాహం చేసుకున్నాడు. పెళ్లి అయినప్పటి నుంచి భార్యను సరిగ్గా చూసుకోకుండా వేధింపులకు గురిచేసేవాడు. పెళ్లి సమయంలో 15 లక్షల కట్నం, 25 తులాల బంగారం ఇచ్చారు. 
 
అయినా.. అవి సరిపోనట్టు మరింత కట్నం కోసం వేధింపులకు గురిచేసేవాడు. అదే సమయంలో ఫేస్‌బుక్‌లో అమ్మాయిలతో పరిచయం పెంచుకుని ప్రేమ, పెళ్లి అంటూ బురీడి కొట్టించాడు. అలా విజయ్ భాస్కర్ చేతిలో ఆరుగురు మోసపోయినట్టు పోలీసులు గుర్తించారు. భార్య ఫిర్యాదుతో భాస్కర్ బండారం బయటపడింది. ఎలాగైనా న్యాయం చేయాలని పోలీసులను భార్య విజ్ఞప్తి చేస్తోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేటుగాడి చేతిలో మోసపోయిన యువతుల వద్ద కూడా విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముచ్చటగా మూడోసారి విడాకులు ఇచ్చేశాను.. హ్యాపీగా వున్నాను: మీరా వాసుదేవన్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments