Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యలేని భర్త.. 17 యేళ్ల కుమార్తెపై అత్యాచారం... జైలుశిక్ష

Webdunia
శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (13:13 IST)
భార్య చనిపోయిన తర్వాత తన బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నతండ్రి.. 17 యేళ్ల కుమార్తె శీలంపైనే కాటేశాడు. మద్యం సేవించిన మత్తులో కుమార్తెపై లైంగికదాడికి తెగబడ్డాడు. అలా 10 నెలలుపాటు కుమార్తెతో ఆ కామాంధుడు కామవాంఛ తీర్చుకున్నాడు. ఈ కేసులో ముద్దాయిగా తేలిన కామాంధతండ్రికి కోర్టు యావజ్జీవ కారాగారశిక్షను విధించింది. 
 
తెలంగాణ రాష్ట్రంలో వెలుగు చూసిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, కొంపల్లిలోని వీకర్ సెక్షన్ కాలనీకి చెందిన కొనగల్ల వేణు(40) అనే వ్యక్తి కూలిపనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈయన భార్య ఎనిమిదేళ్ళ క్రితం చనిపోయింది. 
 
అప్పటి నుంచి తన పిల్లలను పోషించుకుంటూ వస్తున్నాడు. అయితే, నాలుగేండ్ల క్రితం మద్యం తాగి వచ్చి 17 యేళ్ల చిన్నకుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అప్పటి నుంచి పది నెలల పాటు తన కామవాంఛ తీర్చుకున్నాడు. పైగా, ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని కూతురిని బెదిరించసాగాడు. 
 
ఈ క్రమంలో 2017లో దీపావళికి ఆ బాలిక వరంగల్​లోని తన చిన్నమ్మ ఇంటికి వెళ్లింది. అక్కడ బాలిక అనారోగ్యానికి గురికావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా అసలు విషయం తెలిసింది. ఆ చిన్నారిని చిన్నమ్మ నిలదీయడంతో అసలు విషయం చెప్పింది. ఆ తర్వాత బాలిక చిన్నమ్మతో కలిసి అదే ఏడాది అక్టోబర్ 25న పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. వేణును అరెస్టు చేసి జైలుకు  తరలించారు. ఈ కేసువిచారణ ఎల్‌బీనగరులోని మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో జరిగింది. ఈ కేసును విచారించిన కోర్టు జడ్జి సురేశ్... ముద్దాయిగా తేలిన వేణుకు జీవితకారాగార శిక్షను విధిస్తూ తీర్పునిచ్చారు. అలాగే, పదివేల రూపాయల అపరాధం కూడా విధించారు.

సంబంధిత వార్తలు

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments