Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

షాక్... ఢీ షోలో డ్యాన్స్ చేస్తూ కిందపడిపోయిన యువతి, తల నుంచి రక్తస్రావం

Advertiesment
షాక్... ఢీ షోలో డ్యాన్స్ చేస్తూ కిందపడిపోయిన యువతి, తల నుంచి రక్తస్రావం
, శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (11:34 IST)
ప్రముఖ తెలుగు ఛానల్ ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ షో గురించి వేరే చెప్పక్కర్లేదు. ఈ షో విజయవంతంగా దూసుకుని వెళ్తుంది. ప్రస్తుతం ఢీ 13వ సీజన్ నడుస్తోంది. ఈ షోకి న్యాయ నిర్ణేతలుగా ప్రియమణి, సంగీత, పూర్ణ వ్యవహరిస్తున్నారు. ఏప్రిల్ 14న ప్రసారం కానున్న ప్రొమోను ఢీ యూనిట్ రిలీజ్ చేసింది.
 
ఈ ప్రొమోలో డ్యాన్స్‌ చేస్తూ ఓ కంటెస్టెంట్‌ ప్రమాదవశాత్తూ స్టేజ్‌ కింద పడి ఆమె తలకు బలమైన గాయం అయినట్లు కనబడింది. ఈ విజువల్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. డ్యాన్స్‌ చేస్తూ కిందకు దూకే ఓ షాట్‌లో కంటెస్టెంట్‌ ప్రమాదవశాత్తూ కింద పడిపోయిన ఘటనలో ఆమె తలకు తీవ్రంగా దెబ్బ తగిలి రక్తస్రావమైంది.
 
కాగా ఇది నిజంగా ప్రమాదమా.. లేదంటే పబ్లిసిటీ స్టంటా అనేది తెలియాలంటే ఏప్రిల్‌ 14 వరకూ వేచి చూడాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కన్నడ బిగ్‌బాస్ సెలబ్రిటీ ఆత్మహత్యాయత్నం.. పెళ్లైన కొద్ది రోజులకే..?