Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటర్ విద్యార్థినిని హత్య చేసి గుట్టల్లో పడేశారు.. మరో విద్యార్థి కూడా...

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌, మదీనాగూడలో దారుణం జరిగింది. ఓ ఇంటర్‌ విద్యార్థినిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి గుట్టల్లో పడేశాడు. ఆ విద్యార్థినిని రేప్ చేసి ఆపై హత్య చేసి శవాన్ని గు

Webdunia
మంగళవారం, 12 సెప్టెంబరు 2017 (09:58 IST)
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌, మదీనాగూడలో దారుణం జరిగింది. ఓ ఇంటర్‌ విద్యార్థినిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి గుట్టల్లో పడేశాడు. ఆ విద్యార్థినిని రేప్ చేసి ఆపై హత్య చేసి శవాన్ని గుట్టల్లో పడేసివుంటారని పోలీసులు భావిస్తున్నారు. 
 
విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు హత్యా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మృతురాలిని చాందిని జైన్‌గా గుర్తించారు. ఈ విద్యార్థిని బాచుపల్లిలో ఓ ప్రైవేట్‌ కాలేజీలో ఇంటర్‌ చదువుతూ, ఈనెల 9వ తేదీన ఇంటి నుంచి కాలేజీకి వెళ్లి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు కేసు నమోదు చేశారు. మిస్సింగ్‌ కేసుగా నమోదు చేసుకున్న  పోలీసులు దర్యాప్తు జరుపుతున్న తరుణంలో చాందిని జైన్ హత్యకు గురైన వార్త తెలిసింది. 
 
అలాగే, చంపాపేట్ శ్రీగాయత్రి విద్యా సంస్థల దాష్టీకం మరోసారి బయటపడింది. ద్వితీయ సంవత్సర విద్యార్థి సంజయ్‌ను లెక్చరర్లు చితకబాదారు. దీంతో మనస్తాపం చెందిన సంజయ్ తన నివాసమైన బాలాపూర్‌లోని జనప్రియ అపార్టుమెంట్స్ ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన సంజయ్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. 48 గంటలు గడిస్తేగానీ పరిస్థితి చెప్పలేమని వైద్యులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

ఆడ పిల్లలు ఎదిగేందుకు తోడ్పాడు అందించాలి : నారి గ్లింప్స్ రిలీజ్ చేసిన మంత్రి సీతక్క

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments